Honey Produced By Australian Honeypot Ants Has Highly Effective Antibacterial Properties - Sakshi
Sakshi News home page

Honeypot Ants Benefits: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!

Published Fri, Jul 28 2023 11:22 AM

Honey Produced By Australian Honeypot Ants Has Antibacterial Properties - Sakshi

తేనె అంటే తేనెటీగల నుంచి వస్తుందని అందరికీ తెలుసు. మహా అయితే కొన్ని దేశాల్లో ఇంకాస్తా ఔషధాలతో కూడిన తేనె దొరకొచ్చు.  కానీ మాగ్జిమమ్‌ తేనె అంటే వివిధ తేనెటీగల జాతుల నుంచే వస్తుంది. చీమల నుంచి కూడా తెనె వస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా?. పైగా ఇందులో చాలా మంచి ఔషధాలు ఉన్నాయట.

ఆస్ట్రేలియాలోని ప్రజలు ఈ తేనెనే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇందులో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియలో ఉండే హనీపాట్‌ చీమలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో జలుబు, గొంతు నొప్పుల ఇన్ఫెక్షన్‌ల భారి నుంచి కాపాడే మంచి యాంటీబయోటిక్స్‌ ఉన్నాయట. అక్కడ ప్రజలు సాంప్రదాయ వైద్యంలో భాగంగానే కాగా నిత్య జీవితంలో కొన్ని రకాల వ్యాధులకు ఔషధంగా వాడతారట.

ఈ చీమలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉత్తర భూభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని రిప్లీట్స్‌ అని పిలుస్తారు. ఇవి తేనేను అధికంగా తింటాయి. వాటి పొత్తికడుపులో చిన్న అంబర్‌ గోళీల పరిమాణానికి చేర్చి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అవి తమ గూళ్లు పై కప్పులపై వేళ్లాడుతూ ఉండి ఈ తేనెను స్టోర్‌ చేయడం ప్రారంభిస్తాయి. వాటికి ఆహరం కొరత ఉన్న సమయంలో ఈ తేనెను తీసుకుని జీవిస్తాయి. ఈ తేనె స్టెఫిలోకాకస్‌ ఆరియస్‌ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. క్రిప్టోకోకస్‌ చెట్లలో ఈ చీమలు గూడ్లు కట్టుకుంటాయని చెబుతున్నారు.

వీటి తేనెలో యాంటీమైక్రోబయల్‌ పెప్టైడ్‌,  మిథైల్‌గ్లైక్సాల్ సమ్మేనం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తదితరాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అందువల్లే ఇది మంచి ఔషధంగా ప్రజలు భావించినట్లు తెలిపారు. దీన్ని గాయాలకు లేపనంగా పూస్తే త్వరితగతిన తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ చీమల తేనె మాములు తేనె కంటే చిక్కగా ఉండి తక్కువ తీపి ఉంటుందట. ఇది మాపుల్‌ సిరప్‌ని పోలి ఉంటుంది. అంతేగాదు పరిశోధకులు ఈ తేనెలో ఉండో మైక్రోబయల్‌ను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మందులు తయారు చేసే దిశగా అధ్యయనాలు చేస్తున్నాట్లు పరిశోధకులు తెలిపారు. 

(చదవండి: ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!)

Advertisement
Advertisement