రహస్య కెమెరాలను ఇలా పట్టేయవచ్చు! | Sakshi
Sakshi News home page

రహస్య కెమెరాలను ఇలా పట్టేయవచ్చు!

Published Fri, Mar 1 2024 3:57 PM

How to find hidden cameras in hotels and all check these five methods - Sakshi

హోటల్‌ గదిలో రహస్యంగా స్పై కెమెరాలను అమర్చిన సంఘటనలు ఇటీవల మనం కొన్ని  వినే ఉంటాం. కంటికి నేరుగా కనిపించని ఈ కెమెరాల సాయంతో మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షూట్‌ చేసి రకరకాల నేరాలకు పాల్పడుతున్న విషయమూ మనం వార్తల్లో చూసుంటాం. అయితే ఇ  రహస్యంగా అమర్చిన కెమెరాల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు నిపుణులు. అమెరికాలోని ఓ ఛానల్‌ ఈమధ్యే ఈ అంశంపై ఓ ప్రయోగమూ చేసింది. స్పైకామ్‌లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్న ప్రాంతాలు, వాటిని గుర్తించేందుకు ఉన్న పద్ధతులను కూడా ఇలా వివరించింది... 

ఎక్కడెక్కడ అమర్చే అవకాశాలు
స్పైక్యామ్‌లు చాలా  చిన్నవిగా ఉంటాయి పైగా  కొనుగోలు చేయడం సులభం.  ఉదాహరణకు,  హోటల్స్‌లో ఫోటో ప్రేమ్‌లు, గడియారాలు, కెమెరాను స్మోక్ డిటెక్టర్‌లు, ఎయిర్ ఫిల్టర్ పరికరాలు, పుస్తకాలు, గోడపై ఏదైనా, డెస్క్ ప్లాంట్, టిష్యూ బాక్స్, స్టఫ్డ్ టెడ్డీ బేర్‌, డిజిటల్ టీవీ బాక్స్, హెయిర్ డ్రైయర్, వాల్ క్లాక్, పెన్ లేదా  క్లాత్‌లో   ఆఖరికి టూత్ బ్రష్ హోల్డర్‌లో దీన్ని దాచవచ్చు. అంతేకాదు  బాత్రూమ్ షవర్లు, పైకప్పులు, తలుపు రంధ్రాలు, డెస్క్  పాన్‌లో  కూడా  హిడెన్‌ కెమెరాలు అమర్చి ఉంటాయి.  ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. 

ఒక రూంలో 27 రహస్య కెమెరాలను అమర్చిన సీఎన్‌బీసీ టీం మొత్తం 5 రౌండ్లలో వివిధ సాధనాల ద్వారా పరీక్షించింది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

నేకెడ్ ఐ టెస్ట్‌ 
నేకెడ్‌ ఐ లేదా బేర్ ఐ లేదా అన్ ఎయిడెడ్ ఐ అని కూడా అంటాం.  భూతద్దం లాంటివి ఏమీ లేకుండా  మన కళ్లతోనే పరిసరాలను జాగ్రత్తగా గమనించడం. అనుమానం వచ్చిన వస్తువులను  చెక్‌ చేసుకోవడం.  దీని ద్వారా ఈ టీం  ఒక కెమెరాను మాత్రమే గుర్తించింది.

మొబైల్‌ ఫోన్‌ 
వైఫై నెట్‌వర్క్‌లను స్కాన్ చేసే ‘ఫింగ్‌’యాప్‌ ద్వారా కెమెరా లెన్స్‌ను గుర్తుపట్టొచ్చు. ఇది ఎన్ని కెమెరాలున్నాయో ఇది  ఇట్టే గుర్తు పడుతుంది. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పలేదు. ఇందుకు  స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ను వాడవచ్చు. ఈ విధానం ద్వారా  ఫింగ్‌ 22 డివైస్‌లు వైఫైకి కనెక్ట్‌  అయినట్టు గుర్తించింది కానీ, కెమెరాలు  ఎక్కడ ఉన్నదీ కనిపెట్టలేదు.

ఇంటి ప్రధాన నెట్‌వర్క్‌ కాకుండా, కెమెరా కోసం రెండో వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేశారట. అయినా కూడా కెమెరాల ఉనికిని గుర్తించింది. ఈ పద్దతిలో టీం మూడు కెమెరాలను గుర్తించగలిగింది. ఒకటి వైఫై  డివైస్‌, రెండు షర్ట్‌ బటన్‌, టెడ్డీ  బేర్‌లో మూడోది దొరికింది.

రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్‌ 
దీని ద్వారా స్పై కెమెరాను గుర్తించగానే బీప్‌ సౌండ్‌ సంకేతాన్నందిస్తుంది. కెమెరాలను ఆన్ చేసి, Wi-Fiకి కనెక్ట్ అయినపుడు మాత్రమే కనిపిస్తాయి.ఎస్‌డీ కార్డ్‌లను ఉపయోగించే కెమెరాలను  గుర్తించలేవు.అంతర్నిర్మిత లెన్స్ డిటెక్టర్ కూడా ఉంటుంది. 

లెన్స్ డిటెక్టర్‌ 
ప్రాథమిక లెన్స్ డిటెక్టర్, చౌకైనది, పోర్టబుల్ , ఉపయోగించడానికి సులభమైనది. ఇన్‌ఫ్రా రెడ్‌ కాంతిని విడుదల చేస్తుంది, తద్వారా కెమెరా లెన్స్  గుర్తించినపుడు ఎరుపు డాట్‌ కనిపిస్తుంది.  కానీ ఇక్కడ కూడా  రెండు కెమెరాలను మాత్రమే కనుగొంది టీం.

అధునాతన లెన్స్ డిటెక్టర్
బైనాక్యులర్‌లను పోలి ఉండే అధునాతన లెన్స్ డిటెక్టర్‌. ఇది కెమెరా లెన్స్ నుండి ప్రతిబింబించే కాంతిని కూడా పెంచుతుంది. అయితే, ఈ పరికరం దూరం నుండి పని చేస్తుంది. అలాగే తక్కువ-కాంతి లేదా చీకటిలోమాత్రమే కెమెరాలను గుర్తించగలదు. అదీ కూడా ఒక ప్రత్యేక యాంగిల్‌లో చూసినపుడు మాత్రమే కెమెరాలను గుర్తించడం సులభమైంది  ఈ పద్దతిలో టిష్యూ బాక్స్, లెదర్ బ్యాగ్‌, డెస్క్ కింద ఫైల్స్‌మధ్య ఇలా మొత్తం 11 కెమెరాలను టీం గుర్తించింది.
 

Advertisement
Advertisement