ఇంటీరియర్‌ డిజైనర్‌గా గౌరీ ఖాన్‌ ఎంత చార్జ్‌ చేస్తుందో తెలుసా! | Sakshi
Sakshi News home page

ఇంటీరియర్‌ డిజైనర్‌గా గౌరీ ఖాన్‌ ఎంత చార్జ్‌ చేస్తుందో తెలుసా!

Published Mon, Feb 26 2024 9:41 AM

Interior Designer Gauri Khan Every Journey Has Challenges - Sakshi

బాలీవుడు సూపర్‌ స్టార్‌ షారుఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ సక్సెస్‌ ఫుల్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ తన కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌గా తన ఇంటినే ఎంత విలావంతంగా తీర్చిదిద్దిందో చూస్తే సృజనాత్మకతకు నిర్వచనం గౌరీ ఖాన్‌ ఏమో అనిపిస్తుంది. అంతేగాదు ఓ పక్క తన భర్త కెరియర్‌కు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూనే మహిళా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఆధునాతన సృజనాత్మక నైపుణ్యానికి ఓ కొత్త అద్దాన్ని ఇచ్చారామె. ఈ సందర్భంగా ఇంటీరియర్‌ డిజైనర్‌గా తన జర్నీ ఎలా సాగింంది? అందులో తాను ఎదర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..

నిజానికి గౌరీ ఖాన్‌ బీఏ పట్టభద్రురాలే గాక ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు కూడా చేశారు. ఇక ఆమె తండ్రిది గార్మెంట్‌ వ్యాపారం కావడంతో టైలరింగ్‌లో కూడా కొంత ప్రావిణ్యం ఉంది. అయితే ఈ అర్హతల కారణంగా ఇంటీరియర్‌ డిజైనర్‌ రంగంలోకి ప్రవేశించలేదు. ముంబైలో ఐకానిక్‌గా. మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన షారుఖ్‌-గౌరీ ఖాన్‌ల ఇల్లు 'మన్నాత్‌' బంగ్లా  అత్యద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని నిర్మించి ఏళ్లు కావొస్తుండటంతో అత్యంత సుందరంగా పునర్నిర్మించాలనుకున్నారు ఫారుఖ్‌. ఆ తరుణంలోనే గౌరీఖాన్‌కి ఇంటీరియర్‌ డిజైనర్‌ రంగంపై మక్కువ ఏర్పడింది.  అంతేగాదు ఈ ఇంటిని అత్యంత సుందరంగా మలచడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పనిచేసింది కూడా. అలా ఆమె తనకు తెలియకుండానే ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారారు.

పైగా తమ విలాసవంతమైన బంగ్లా మన్నాత్‌ని ఎంతం అందంగా తీర్చిదిద్దిందంటో అదోక అద్భుతమైన ప్యాలెస్‌ అన్నంత రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు. అలా గౌరీ ఖాన్‌ తన ఇంటిని సర్వాంగాసుందరంగా మార్చే క్రమంలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారారు గౌరీ. ఆ తర్వాత ఆ రంగాన్నే వృత్తిగా ఎంచుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. ఈ రంగంలో మరింత మెళ్లుకవలను నేర్చుకుని తన నైపుణ్యానికి మరింత పదునుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 2013లో ముంబైలో గౌరీ ఖాన్‌ డిజైన్స్‌ పేరుతో డిజైన్‌ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ నుంచి పలు విభిన్న ప్రాజెక్టులను టేకప్‌ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది గౌరీ ఖాన్‌.

ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్‌లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అయితే తాను ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌గా తన సంస్థను ప్రమోట్‌ చేసుకుంటూ ఈ వ్యాపారంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అంటోంది. అంతేగాదు ముఖేష్ అంబానీ , రాబర్టో కావల్లి రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇంటిరీయర్‌ డిజైనర్‌గా పని చేశారు. తాను ఓ స్టార్‌ భార్యను కాబట్టి ఈ రంగంలో సులభంగా విజయం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పంటారు గౌరీ ఖాన్‌. ఎవ్వరైన ఓ వ్యాపారం చేసేటప్పడు జస్ట్‌ సపోర్ట్‌ ఇస్తారు ఇక అక్కడ నుంచి ఎవరికీ వారే స్వయంగా వ్యాపారాన్ని నడిపుంచుకుని, విజయం దక్కించుకోవాల్సిందే అంటున్నారు గౌరీ. దేనికైనా అత్యంత ఓపికతో కూడిన నేర్పు ఉంటేనే సాధ్యమని చెబుతోంది.

ఈ రంగంలో తాను ఎదుర్కొన్నఇబ్బందిని, సవాళ్లని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లేదానిని, అందువల్లే ఇంటీరియర్‌ డిజైనర్‌ ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్‌ అయ్యానని అన్నారామె. ఇక ఆమె ఇంటరీయర్‌ డిజైనర్‌గా టేకప్‌ చేసిన ప్రాజెక్టులకు ఎంత ఛార్జ్‌ చేస్తుందంటే సుమారు రూ. 6 లక్షలు నుంచి మొదలవ్వుతుందట. ఆమె ఇంటీరియర్‌ డిజైన్స్‌ నెట్‌ వర్తే దాదాపు రూ. 200 కోట్లు పైనే ఉంటుందట. దీంతోపాటు ఆమె 2014లో డిజైన్‌ సెల్‌ అనే పేరుతో కాన్సెప్ట్‌ స్టోర్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో గౌరీనే స్వయంగా తీర్చిదిద్దినా ఫర్నీచర్‌ డిజైన్‌లు ఉంటాయి. అంతేగాదు పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎట్ ఆబ్జెట్ షోలో తన ఫర్నిచర్‌ డిజైన్‌లను ప్రదర్శించడానికి ఆహ్వానం సైతం దక్కించుకుంది. అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్‌ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె కూడా ఒకరిగా నిలవడం విశేషం

సెలబ్రెటీ హోదా కంటే ప్రత్యేక గుర్తింపు మిన్న.. 
ఇక్కడ షారుఖ్‌ స్టారడమ్‌ అతడి భార్యగా ఆమెకు ఉంటుంది. అలాగా ఆమె షారుఖ్‌ సినిమాలను నిర్మిస్తూ చిత్ర నిర్మాతగా కూడా మారింది. అయినా మహిళ సాధికారత అనే పదానికి అర్థమిచ్చేలా తనకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంది. అందుకోసం నచ్చిన రంగాన్ని ఎంచుకుంది. అది మొదటగా తన ఇంటి డిజైన్‌ నుంచి ప్రారంభంచి.. ప్రముఖులు ఇళ్లు డిజైన్‌ చేసే స్థాయికి చేరుకుంది. తన సంస్థకు గౌరీ ఖాన్‌ అనే బ్రాండ్‌  నేమ్‌ దక్కించుకుని సక్సెఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోయింది. ఏ మహిళైనా సరే పెళ్లి, పిల్లలు కారణంతో కెరీర్‌ను ఆపేయాల్సిన పనిలేదని నిరూపించింది. అంతేగాదు పిల్లలు ఎదిగిపోయి మనం అవసరం లేదనుకున్న తరుణంలో మళ్లీ మన కెరీర్‌లో లేదా మనకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు యత్నించి, మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోగలమని ప్రూవ్‌ చేశారు గౌరీ ఖాన్‌.

(చదవండి: 'నారీ శక్తి'.. 'నారీ శక్తీ' అంటారుగా! చేతల్లో చూపండి!)
 

Advertisement
Advertisement