Sakshi News home page

ఓరి దేవుడా! నిజంగా సింహమేనా?.. ఇంతలానా!

Published Tue, Aug 22 2023 1:33 PM

Lion Turns Vegan Munches Green Leaves Goes Viral On Social Media - Sakshi

సింహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా అది ఏ జంతువైనా వేటాడిందంటే ఇక అంతే. సింగిల్‌గా ఉన్నా దాని రాజసం, ఠీవినే వేరు. దాని గాండ్రింపుకే హడలిపోవాల్సిందే. అలాంటి సింహం సాధువుగా మారిపోవడం అంటే అస్సలు నమ్మం. ఏదో కథల్లో ఉండొచ్చేమో గానీ రియల్‌గా జరిగే అవకాశమే ఉండదు. నెట్టింట సందడి చేస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం ఇది సింహమేనా అని నోరెళ్లబెడతారు. పైగా అదే ఏం తింటుందో చూస్తే ఓరి దేవుడా! అని ఆశ్చర్యపోవాల్సిందే.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..సింహం సాధువు జంతు మాదిరి ఆకులు తింటోంది. ఏంటి అది సింహమేనా? అని ఒక్కసారిగా డౌటు వస్తుంది. చూస్తే పెద్ద పులిలానే ఉంది. కానీ ఏదో సాధువు జంతువు మాదిరిగా ఆకులు అలమలు తింటోంది. దీంతో నెటిజన్లు సడెన్‌గా సింహం శాఖహారిగా ఎలా మారిపోయిందిని ఒకరు, బహుశా శ్రావణ మాసం కదా అందుకే ఆ సింహం ఆకులు తింటుందని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 

(చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..)


 

Advertisement

తప్పక చదవండి

Advertisement