Photo Feature: ఊరెళ్లిపోతా మావ.. | Sakshi
Sakshi News home page

Photo Feature: ఊరెళ్లిపోతా మావ..

Published Fri, Apr 30 2021 6:23 PM

Local To Global Photo Feature In Telugu April 30, 2021 - Sakshi

ఏ క్షణంలో కరోనా మహమ్మారి కబలిస్తుందో తెలియని అనిశ్చితి వాతావరణంలో హైదరాబాద్‌ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద వేచి ఉన్న ప్రయాణికులు. 
 

1/8

ఉపాధి కోసం దేశం దాటి వచ్చిన నేపాలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో హైదరాబాద్‌లోని నేపాలీలంతా మూటా ముల్లె సద్దుకుని స్వదేశానికి తిరుగుపయనం అవుతున్నారు.

2/8

ముంబైలోని ఎంఎంఆర్‌సీ కోవిడ్‌ సెంటర్‌లో 45 ఏళ్లు పైబడిన వారి కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రంలో గురువారం రద్దీ

3/8

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బారికేడ్లు తొలగించిమరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న రోగులు

4/8

రష్యా నుంచి రెండు కార్గో విమానాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం ఉదయం చేరుకున్న 22 టన్నుల వైద్య సామాగ్రి

5/8

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల 8వ విడత పోలింగ్‌లో గురువారం ముగిసింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ముర్షీదాబాద్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు జనం బారులు తీరారు.

6/8

భార్య మృతదేహాన్ని తరలించడం వీలుకాక సాయం కోసం చూస్తున్న తిలక్‌ధారి. తోడెవరూ రాక నిస్సహాయతతో సైకిల్‌ను వదిలేసి పక్కన కూర్చున్న తిలక్‌ధారి. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లా అంబర్‌పూర్‌ గ్రామంలో జరిగిన విషాద ఘటన.

7/8

నవీ ముంబైలో టీకా డోస్‌లు లేకపోవడంతో జనంలేక ఖాళీగా ఉన్న ఓ ప్రభుత్వ టీకా కేంద్రం

8/8

చిన్నారులు ముక్కు, గొంతు నుంచి కరోనా శాంపిల్స్‌ సేకరించే సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారెంతో ఇష్టంగా తినే లాలీపాప్‌ ఆకారంలో రూపొందించిన పరికరమిది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని కొన్ని స్కూళ్లలో ఈ విధానంలో కోవిడ్‌ పరీక్షలు జరుపుతున్నారు. మెత్తగా ఉండే ఈ పరికరాన్ని బ్రష్‌ మాదిరిగా నోటిలో అటూఇటూ తిప్పి పరీక్షిస్తారు.

Advertisement
Advertisement