మా నాయినే! కొబ్బరికాయను తలకేసి కొట్టుకున్నాడు | Sakshi
Sakshi News home page

మా నాయినే! కొబ్బరికాయను తలకేసి కొట్టుకున్నాడు

Published Sun, Apr 7 2024 5:55 AM

Man Attempt To Crack Coconut With Forehead - Sakshi

వైరల్‌

కొబ్బరికాయను రాయిపై కొడితే పగులుతుంది. నుదుటిపై కొడితే? వైరల్‌ అవుతుంది! విషయంలోకి వస్తే... తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కొబ్బరికాయ పట్టుకొని పూజాపీఠం దగ్గర శ్లోకాన్ని జపించాడు. ఆ తరువాత తల పైకి లేపి కొబ్బరికాయను నుదుటి మీద కొట్టుకున్నాడు.

‘యాక్షన్‌కు రియాక్షన్‌’ అనేది ప్రకృతి ధర్మం కదా! సదరు వ్యక్తి వెంటనే కుప్పకూలి΄ోయాడు. ఈ వీడియో వైరల్‌ కావడం మాట ఎలా ఉన్నా వ్యక్తి చర్యను నెటిజనులు ఖండించారు. ‘ఆపరేషన్‌ సక్సెస్‌ బట్‌ పేషెంట్‌ డెడ్‌’, ‘గాయపడింది నువ్వు కాదు... కొబ్బరికాయ’లాంటి సరదా కామెంట్స్‌ ఎన్నో కనిపించాయి.

Advertisement
Advertisement