McDonalds Customer Awarded Rs 6 Crore In Damages For Hot Chicken Nugget Burns, Goes Viral - Sakshi
Sakshi News home page

పొగలుకక్కే ఫుడ్‌ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్‌ రూ. 6 కోట్లు చెల్లించింది!

Published Fri, Jul 21 2023 5:22 PM

McDonalds Customer Awarded Rs 6 Crore Due To Hpt Chicken Nugget  - Sakshi

మనం రెస్టారెంట్‌కి లేదా హోటల్‌కి వెళ్లితే..నిర్వాహకులు మంచి వేడి..వేడిగానే ఆహారం తీసుకొస్తారు. ఒకవేళ తొందరపడి తింటే..కాలినా.. అక్కడ ఉన్న సర్వర్‌పై అరవలేం. పైగా కేసు పెట్టను కూడా పెట్టం. కానీ ఓ కుటుంబం వేడిగా ఉందని మాకు చెప్పలేదు, అందువల్లే మా పాపకు కాలిపోయిందని కోర్టు మెట్లు ఎక్కింది. పైగా మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని ఫిలానా హోమ్స్‌, ఆమె భర్త, తన నాలుగేళ్ల పాప ఒలివియా కారబల్లోతో కలిసి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లారు. అప్పుడు వారు తమ చిన్నారి కోసం హాట్‌ చికెన్‌ మెక్‌ నగెట్‌ని ఆర్డర్‌ చేశారు. అది కాస్త తినే తొందరలో చిన్నారి తొడపై పడటంతో.. తీవ్ర గాయమైంది. దీంతో ఆ జంట ఆహరం వేడిగా ఉందని ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేసింది. తమకు న్యాయం కావలంటూ..కోర్టు మెట్లు ఎక్కింది.

చికెన్‌లోని సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి 160 డిగ్రీల హీట్‌ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. కానీ మెక్‌డొనాల్డ్స్‌ 200 డిగ్రీ వేడితో ఉన్న చికెన్‌ నగ్గెట్‌ని ఇచ్చిందని వాదించింది. తన కూతురు ఒలివియాకు అయిన గాయాన్ని, దానివల్ల ఆమె అనుభవించిన బాధను ఆధారంగా చూపించింది. అంతేగాదు ఇప్పటికీ తన కూతురు చికెన్‌ నగెట్‌ని తింటోంది. కానీ ఇలా జరగలేదు కదా అని గట్టిగా తన వాదన వినిపించింది.

దీంతో కోర్టు.. అక్కడ చిన్నారుల హక్కుల ప్రకారం ఆమెకి జరిగిన గాయానికి గానూ పరిహారంగా సదరు మెక్‌డొనాల్డ్స్‌ ఏకంగా ఆరు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత బుధవారమే ఆదేశించింది. అంతేగాదు ముందుగా గత నాలుగేళ్లకు పరిహారంగా రూ. 3.27 కోట్లు చెల్లించాలని ఆ తర్వాత మిగతా డబ్బును నిర్ణిత గడువులోపల చెల్లించాలని పేర్కొంది. పాపం మెక్‌ డొనాల్డ్‌కి ఓ రేంజ్‌లో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిందిగా సదరు కుటుంబం. 

(చదవండి: 'గోల్డెన్‌ వాటర్‌ స్పౌట్‌'..ప్రకృతి అద్భుతం)

Advertisement

తప్పక చదవండి

Advertisement