ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని.. | Sakshi
Sakshi News home page

ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..

Published Tue, Mar 26 2024 11:57 AM

Mother Sentenced To Life For Her Toddlers Death - Sakshi

కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అన్నంత బాధగా ఉంటుంది. అలాంటి వాళ్లను చూస్తే..అస్సలు తల్లి అన్న పదానికి ఉన్న గొప్ప అర్థం కూడా విలువలేనిదిగా అయిపోతుంది. తల్లి మనసు బహు సున్నితంగా ఉంటుంది. తన బిడ్డకు ఏమైనా అయితే అంత ఎత్తున కోపంతో లేగిసిపోతుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అస్సలు ఈమె తల్లేనా..ఇలాంటి ఆమెకు దేవుడు పిల్లల్ని ఎందుకిచ్చాడు అన్నంత బాధకలుగుతుంది.

వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసావంత జీవితానికి అలవాటు పడింది. అయితే ఆమెకు భర్త ఉన్నాడో లేక ఆమె విలాసాలను చూసి తట్టుకోలేక వదిలేశాడో తెలియదు గాని..క్రిస్టల్‌ మాత్రం తన కూతురితో క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఉంటుంది.

గత ఏడాది జూన్‌ నెలలలో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఈ తర్వాత మరో నగరానికి చక్కర్లు కొట్టింది. అయ్యే ఇంట్లో పాపం ఏమవుతుందన్న బాధ ఇసుమంత కూడా లేకుండా నిసిగ్గుగా ఎంజాయ్‌ చేసింది. ఇలా దాదాపు పదిరోజులు ఇంటి పట్టున లేకుండా పోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి చూడగా.. పాప ఉయ్యాలలో నిర్జీవంగా కనిపించింది. వెంటనే క్రిస్టల్‌ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని,విచారణ నిమిత్త కోర్టు ఎదుట హాజరుపరిచారు. 

కోర్టులో క్రిస్టల్‌ చేసిన ఘనకార్యాన్ని విని నిర్ఘాంతపోయారు. ఈ కేసును సుమారు 9 నెలలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం కనివిని ఎరుగని స్థాయిలో తీర్పు ఇచ్చారు. "ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక తల్లి తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. ఇలాంటి తప్పు భవిష్యత్తులో మరే ఏ తల్లి చేయకుండా ఉండేలా కఠిన తీర్పు ఇస్తున్నాను. ఈమెకు బెయిల్ అనేది లేకుండా యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని" జడ్జి తీర్పు చెప్పారు.

దీంతో ఆమె తరపు న్యాయవాదులు.. సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి అలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు. దీంతో జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇక క్రిస్టల్‌  వ్యవహారం విని అమెరికా మాత్రమే కాదు యావత్‌ ప్రపంచం దిగ్బాంతికి గురయ్యింది. ఇలాంటి పాషణ హృదయంతో ఉండే తల్లులు కూడా ఉన్నారా..? అని విస్తుపోయింది . 

(చదవండి: డైట్‌లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం!)

Advertisement
Advertisement