Nonalcoholic Fatty Liver Disease Symptoms and Causes - Sakshi
Sakshi News home page

మద్యం అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్‌ వస్తుందా?

Published Sun, Jul 23 2023 9:49 AM

Nonalcoholic Fatty Liver Disease Symptoms And Causes - Sakshi

మనలో కొంతమందికి ఫ్యాటీలివర్‌పై ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారు కాలేయంలో క్రమక్రమంగా కొవ్వు పెరుగుతూ ఒక దశ తర్వాత కణాలన్నీ పూర్తిగా నశించి, కొవ్వు మయం అయిపోతే..అది సిర్రోసిస్‌ అనే కండిషన్‌కు దారితీస్తుందనీ, అప్పుడు కాలేయ మార్పిడి తప్పదనే అవగాహన కొంతమందిలో ఉంటుంది. అయితే మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్‌ వస్తుందన్నది పాక్షిక సత్యమే..ఆ అలవాటు లేనివారిలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కండిషన్‌నే నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌(ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) అంటారు. శరీరతత్త్వాన్ని బట్టి మద్యం, మాంసాహార అలవాట్లు లేకపోయినా నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ రావచ్చేనే అవగాహన కల్పించేదే ఈ కథనం.

మద్యం అలవాటు లేనివారిలోనూ నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌! మానవుల పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. తీసుకున్న ఆహారంలోని చక్కెరలు శక్తిగా మారాక... మిగతావి కొవ్వు రపంలోకి వరి కాలేయంలో నిల్వ ఉంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఈ నిరంతర పక్రియలో కొవ్వు వెతాదులు పెరుగుతున్న కొద్దీ కాలేయ కణాలు తమ స్వగుణాన్ని కోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్‌ అంటారు. మద్యం అలవాటు ఉన్నా, పొట్ట ఎక్కువగా ముందుకొచ్చి ఉన్నా... వారిలో కాలేయం దశలవారీగా, ఎంతో కొంత ఫ్యాటీలివర్‌గా మారిపోయి ఉంటుంది.

కారణాలు:

  • జీవనశైలి / మెటబాలిక్‌ డిసీజెస్‌గా పేర్కొనే డయాబెటిస్‌ ఉన్నవారిలోన, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం (సెంట్రల్‌ ఒబేసిటీ), స్థూలకాయం (ఒబేసిటీ) వంటి అంశాలు నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌కు కారణం కావచ్చు.
  • ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.

లక్షణాలు:

  • ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌లోనైనా కొద్దిమేరకు లక్షణాలు కనిపింవచ్చేమోగానీ... నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌లో చాలావరకు లక్షణాలు కనిపించవు. అయితే మనకు చాలా సాధారణం అనిపించే కొన్ని లక్షణాలు నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ను పట్టిస్తుంటాయి. ఉదా: పొట్ట పెరిగి, బానపొట్టలా ముందుకు రావడం.
  • కొందరిలో కుడివైపు పొట్ట పైభాగంలో పొడుస్తున్నట్లుగా నొప్పి రావడం. లివర్‌ క్రమంగా పెరుగుతుండటంతో ఈ లక్షణం బయటపడుతుంది.

నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌... దశలు...
నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. అవి మొదటి సింపుల్‌ స్టియటోసిస్‌ దశ, రెండోది స్టియటో–హెపటైటిస్‌ దశ. మూడోది ఫైబ్రోసిస్‌ దశ, నాలుగోదీ, వరదీ... ఇక వెనక్కు తిప్పడానికి వీలుకాని సిర్రోసిస్‌ దశ.

మొదటి దశ: ఇది సాధారణమైన ఫ్యాటీ లివర్‌ వ్యాధి దశ. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా అంటే 5 శాతం నుంచి 10 శాతం మేరకు కొవ్వు శాతం పేరుకుంటుం‍ది.

రెండో దశ (నాశ్‌): ఈ దశను నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటో–హెపటైటిస్‌ (ఎన్‌ఏఎస్‌హెచ్‌–నాశ్‌) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కాలేయ కణాలు కొన్ని నశిస్తాయి.

మూడో దశ (ఫైబ్రోసిస్‌): ఈ దశలో కాలేయం పీచుగా మారినట్లుగా కనిపిస్తుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్‌’గా పేర్కొంటారు.

నాలుగో దశ (సిర్రోసిస్‌): ఫైబ్రోసిస్‌ నుం కాలేయం కొవ్వుకణాలతో నిండిపోయి, పూర్తిగా తన స్వరపాన్ని కోల్పోయి, కాలేయ వర్పిడి తప్ప ప్రత్యామ్నాయం లేని దశ వస్తుంది. ఇది వెనక్కుమరల్చలేని (ఇర్రివర్సిబుల్‌) దశ.

నిర్ధారణ:

  • బాధితుని స్థలకాయం, పొట్ట (సెంట్రల్‌ ఒబేసిటీ) చసి డాక్టర్లు పరిస్థితిని కొంతమేర అంచనా వేయగలరు.
  • కొన్ని రక్తపరీక్షలు, అలాగే డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ వెతాదులు, ట్రైగ్లిజరైడ్‌ స్థాయులు పెరిగాయా అన్నదీ చూడాలి.
  • అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌తో ఫ్యాటీలివర్‌ తప్పక బయటపడుతుంది. కొందరిలో లివర్‌ బయాప్సీ అవసరం.
  • లివర్‌ బయాప్సీతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీలో అది నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివరా (ఎన్‌ఏఎఎఫ్‌ఎల్‌), లేక నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటో–హెపాటిక్‌ (నాశ్‌) కండిషనా అని నిర్ధారణ చేయవచ్చు.
  • ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్‌’ అనే వైద్యపరీక్షతో లివర్‌లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్‌ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయి, తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు.

చికిత్స :
ఆల్కహాల్‌ అలవాటు లేనివారిలో దీని చికిత్సకు నిర్ణీతంగా ఒక ప్రొటోకాల్‌ లేదుగానీ... దీని చికిత్స సమయంలో ఫ్యాటీలివర్‌ డిసీజ్‌కు దోహదపడిన అంశాలను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. ముఖ్యంగా బాధితుల జీవనశైలిలోనూ, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం వంటివి సస్తారు. బాధితులు ఏవైనా మందులు వాడుతుంటే, వాటి కారణంగా ఫ్యాటీలివర్‌ వచ్చిందని భావిస్తే, వాటిని మారుస్తారు. చాలా కొద్దిమందిలో మందులూ, శస్త్రచికిత్సా అవసరం కావచ్చు.

ముందస్తు నివారణకు ఈ జాగ్రత్తలు...
బరువు తగ్గడం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉన్నవారు ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించాలి. ప్రతి వారం అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరి. పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్‌ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు వాడాలి. రిఫైన్డ్‌ షుగర్స్, మైదా, స్వీట్లు తగ్గించాలి. మాంసాహారం తీసుకునేవారు చేపలు తినడం మంచిది.
వ్యాయామం: చురుగ్గా ఉంటూ రోజూ ఒంటికి పనిచెప్పేలా శ్రమించాలి. రోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్‌ వెతాదులను తగ్గించుకోండి. ఇందుకు వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాలి.

(చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్‌ పెడితే..వాటి పువ్వులు ఏమో.)

Advertisement

తప్పక చదవండి

Advertisement