ఈజిప్ట్‌ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! | Sakshi
Sakshi News home page

ఈజిప్ట్‌ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!

Published Tue, Jan 30 2024 10:46 AM

PM Modi Praises Rendition Of Patriotic Song By Egyptian Girl - Sakshi

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన దేశభక్తి గీతం పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియోని కైరోలోని భారత రాయబార కార్యాలయం నెట్టింట షేర్‌ చేసింది.

ఆ వీడియోలో ఈ జిప్ట్‌కి చెందిన కరీమాన్‌ అనే అమ్మాయి దేశభక్తి గీతం "దేశ్‌ రంగీలా" పాటను ఎంతో చక్కగా ఆలపించింది. ఈ వీడియోని చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నానికి ఆమెను అభినందిస్తున్నాను. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కాగా, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీమాన్‌ పాడిన పాట ‍ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడి రాయబార కార్యాలయంలో కరీమాన్‌ గానం​ అటు భారతీయులను, ఈజిప్షియన్లను ఎంతగానో ఆకట్టుకోవడం విశేషం.

(చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?)

Advertisement
Advertisement