Sakshi News home page

అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదు..ఏకంగా..

Published Sun, Sep 3 2023 8:16 AM

Rare Walking Handfish Captured On Deep Sea Camera  - Sakshi

నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్‌ఫిష్‌ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్‌ఫిష్‌ చేప కనిపించింది.

ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్‌ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్‌ఫిష్‌ అండర్‌వాటర్‌ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్‌ తెలిపారు. సీఎస్‌ఐఆర్‌ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్‌వీ ఇన్వెస్టిగేటర్‌’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. 

(చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!)

Advertisement
Advertisement