Sakshi News home page

రియల్‌ ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్‌! నెటిజన్లు ఫిదా

Published Sun, Feb 11 2024 12:07 PM

Russian Youtuber Creates Real Life Iron Man Suit With Repulsor Blasts - Sakshi

నటులడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన హాలీవుడ్‌ సినిమా ఐరన్‌ మ్యాన్‌ విడుదలైనప్పటి నుంచి ఆ క్యారక్టర్‌కి విశేష ప్రజాధరణ లభించింది. ఆ క్యారక్టర్‌కి స్ఫూర్తిగా చాలామంది పలు రకాలుగా ఐరన్‌ సూట్‌లు రూపొందించారు. అయినప్పటికీ, రష్యన్ కంటెంట్ సృష్టికర్త ఇంజనీర్ అలెక్స్ బుర్కాన్ సృష్టి వేరుగా ఉంది, అతను మొదటి నుంచి ఐరన్ మ్యాన్ సూట్‌ను జాగ్రత్తగా జీవం పోసాడు. అతను రూపొందించిన సూట్‌ సౌందర్యానికి మించి, ఆధునాతన లక్షణాలతో నిండిన సాంకేతిక అద్భుతం.

ఇతరులు రూపొందించినట్లుగా కాకుండా  యూట్యూబర్సూ‌ అలెక్స్ బుర్కాన్ సూట్‌లో సెల్ఫ్ పవర్డ్ హైడ్రోజన్ రియాక్టర్, రిపల్సర్ అప్‌గ్రేడ్, బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్ వంటి సాకేంతికత ఉంది.ఈ రష్యన్‌ ఇంజినీర్, యూట్యూబర్‌ అలెక్స్‌ బుర్కాన్‌ రూపొందించిన రియల్‌ ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘రియల్‌–లైఫ్‌ ఐరన్‌ మాన్‌ సూట్‌ విత్‌ ఏ రిపల్సర్‌ బ్లాస్ట్‌’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది.

 ‘క్లిష్టమైన డిజైన్‌తో రూపొందించిన ఐరన్‌ మ్యాన్‌ సూట్‌కు సంబంధించి అలెక్స్‌ బుర్కాన్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి అలెక్స్‌ ఎదుర్కొన్న సాంకేతిక సవాళ్లు, టెస్టింగ్‌ దశలను తెలియజేసేలా ఉంటాయి ఈ వైరల్‌ వీడియోలు. ‘రియల్‌ లైఫ్‌ టోనీ స్టార్క్‌’ అంటూ అలెక్స్‌ను ఆకాశానికెత్తాడు ఒక నెటిజెన్‌. నిజానికి సైన్స్‌–ఫిక్షన్‌ టెక్‌కు సంబంధించి అలెక్స్‌కు ఇది ఫస్ట్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఏమీ కాదు. గతంలో కూడా ఆశ్యర్యం కలిగించే ఎన్నో పరికరాలను తయారు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు.

(చదవండి: చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌!)

Advertisement

తప్పక చదవండి

Advertisement