కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి! | Sakshi
Sakshi News home page

Kitchen Tips: కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!

Published Fri, Jul 1 2022 9:12 PM

Simple And Best Kitchen Tips In Telugu For Gravy In Curry - Sakshi

కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...!

పెరుగు, ఫ్రెష్‌ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి.
దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది.


జీడిపప్పులను పాలలో నానబెట్టాలి.
నానాక జీడిపప్పుని నేతిలో  వేయించాలి.
చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది.


కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది.
వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి.
దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది.

చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

Advertisement

తప్పక చదవండి

Advertisement