సర్జరీ చేస్తున్న టైంలో పేషెంట్‌పై డాక్టర్‌ దాడి! వీడియో వైరల్‌ | Surgeon Punching Patient During Eye Surgery, Shocking Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్‌ దాడి! వీడియో వైరల్‌

Published Sun, Dec 24 2023 1:03 PM

Surgeon Punching Patient During Eye Surgery - Sakshi

ఓ వైద్యుడు విచక్షణ మరిచి సర్జరీ చేసే సమయంలో పేషెంట్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. అతను అలా దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని సదరు ఆస్పత్రి బాధితుడికి నష్ట పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ షాకింగ్‌ ఘటన చైనాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..2019లో జరిగిన ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు చైనా పేర్కొంది. దీనిపై ఇప్పుడు చైనా అధికారులు కూలంకషంగా ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఐయర్‌ ఆస్పత్రిలో జరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఆక్టోజెనేరియన్ అనే 82 ఏళ్ల మహిళ కంటి ఆపరేషన్‌ కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తుండగా, ఆమె అసహనంతో కదలిపోవడం ప్రారంభించింది. ఐతే రోగికి స్థానికి మాండలిక భాష మాత్రేమ తెలుసు. పాపం వైద్యుడికి ఆ భాషలో అంత ప్రావిణ్యం లేదు.

అందువల్లో ఇరువరి మధ్య కమ్యూనికేషన్‌ కాస్త ఇబ్బందిగా మారింది. ఓ పక్క సర్జరీ టైంలో పేషెంట్‌ కనుబొమ్మలు కదిలించడం వంటివి చేశాడు. వైద్యుడు చెబుతున్నవేమి రోగికి అర్థంగాక అదేపనిగా కదలడంతో అసహనం చెందిన వైద్యుడు కొట్టడం జరిగింది. దీంతో ఆమె ఎడమ కన్ను పైభాగంలో గాయలయ్యాయి. అందుకు సదరు ఆస్పత్రి దాదాపు 500 యువాన్లు(రూ. 60, వేలకు పైనే) వరకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సదరు వైద్యుడిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా ఆ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్‌ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండటంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

దీంతో చైనా అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఐయర్‌ ఆస్పత్రిలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితురాలి కొడుకు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ..ఆ డాక్టర్‌ దూకుడు ప్రవర్తన కారణంగా ఎడమ కన్ను పైభాగంలో కూడా గాయలయ్యాయిని, ఐతే ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీరియస్‌ అయిన అధికారులు సదరు ఆస్పత్రి సీఈవో, ఆ వైద్యుడిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో అలాంటి అనుచిత ప్రవర్తన తగదని,  తక్షణమే చర్యలు తీసుకుంటామని చైనా అధికారులు వెల్లడించారు. 

(చదవండి: బ్లూ సీ డ్రాగన్‌! చూడటానికీ అందంగా ఉందని టచ్‌ చేశారో అంతే..!)

Advertisement
Advertisement