అభిమానితో పెళ్లయ్యి 20 ఏళ్లు

26 Aug, 2020 00:02 IST|Sakshi
భార్య సంగీతతో విజయ్‌

వైవాహిక బంధం

ఆగస్ట్‌ 25న తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ తన 21వ పెళ్లిరోజు జరుపుకున్నారు. అభిమానులను పెళ్లి చేసుకున్న కళాకారులు చాలామంది ఉన్నారు. విజయ్‌ కూడా తన కరడు గట్టిన అభిమాని సంగీతను పెళ్లి చేసుకోవడం విధి రాసిపెట్టి ఉండటం వల్లే సాధ్యమైందని భావిస్తారు. విజయ్, సంగీతాల పెళ్లి 1999లో జరిగింది. వారిద్దరికి పెళ్లి జరుగుతుందని వారికే తెలియదు. సంగీతా లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. అయితే విజయ్‌ సినిమాలు చూసి అతడికి వెర్రి ఫ్యాన్‌గా మారింది. విజయ్‌ని చూడటానికే 1996లో లండన్‌ నుంచి చెన్నైకి వచ్చింది. ఎవరో తెలిసినవారి ద్వారా విజయ్‌ని కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్‌ నుంచి వచ్చారా’ అని విజయ్‌ ఆశ్చర్యపోయారు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు.

ఇంటికి వచ్చిన సంగీతాను విజయ్‌ తల్లిదండ్రులు (తండ్రి ప్రసిద్ధ సినీ దర్శకుడు చంద్రశేఖర్‌) గమనించి ఇష్టపడ్డారు. ‘ఈసారి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో రామ్మా’ అన్నారు. సంగీతా రెండు మూడేళ్లలో తల్లిదండ్రులతో విజయ్‌ ఇంటికి వచ్చింది. విజయ్‌ తల్లిదండ్రులే ‘అమ్మాయి లక్షణంగా ఉంది. పెళ్లి చేసుకోరా’ అని విజయ్‌కు చెప్పారు. విజయ్‌కు కూడా మెల్లగా సంగీతా అంటే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. సంగీతాకు ఎలాగూ తెగ ఇష్టమే. చివరకు మూడేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్‌ సంజయ్‌. కుమార్తె దివ్య శాషా. సంగీతా ఎక్కువగా సినిమా వర్గాల మధ్య కనిపించరు. కుటుంబ బాధ్యత, పిల్లల పెంపకం గురించి శ్రద్ధ పెడతారు. గృహశాంతి ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటే విజయమూ ఉంటుంది. విజయ్‌ విజయాల వెనుక సంగీతా ఉన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా