చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! | Sakshi
Sakshi News home page

చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! ధర ఏకంగా..!

Published Mon, Jan 8 2024 10:49 AM

UK Couple That Trains Trees To Grow Into Furniture - Sakshi

చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్‌ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు.

ఎలా  చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్‌, ఆలిస్‌ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్‌ ఫామ్‌ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్‌ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్‌ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్‌ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు.

దీన్ని గావిన్‌  ఒక రకమైన జెన్‌ త్రీడీ ప్రింటింగ్‌ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్‌ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్‌ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.  అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్‌ ఫ్రేమ్‌ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్‌కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్‌రైట్‌ అవుతుందని.

ఆ తర్వాత గావిన్‌ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది.

ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు  ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్‌. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్‌ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్‌ గ్రోన్‌ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది.

అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్‌ ఆలిన్‌ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్‌ ఆలిస్‌ దంపతులు. 

(చదవండి: 30 ఏళ​ క్రితం పోయిన బ్యాగ్‌ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..)

Advertisement
Advertisement