వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్‌ ఏంటంటే..? | Sakshi
Sakshi News home page

వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్‌ ఏంటంటే..?

Published Fri, Jan 19 2024 11:31 AM

US Woman Loses Arm After Being Mauled By Stray Dog She Was Fostering - Sakshi

ఒక్కోసారి మనం ఆశ్రయం కల్పించిన జంతువులే మనపై దాడి చేస్తాయి. అలా జరుగతుందన్న ఊహ కూడా రాదు. అలాంటి స్థితిలోనూ సంయమనం కోల్పోకుండా వ్యవహరించి సానూకూలదృక్పథంతో మాట్లాడటం కొందరికే సాధ్యం. అలాంటి కోవకు చెందింతే ఈ మహిళ. తాను ఆశ్రయకల్పిస్తున్న వీధికుక్కల్లో ఒక్క కుక్క ఆమె దారుణంగా దాడి చేసింది. ఎంతలా అంటే.. ఆ దారుణ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్లిపోయింది. 

అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన కాలిస్టా మునోజ్‌ అనే 25 ఏళ్ల మహిళ తన వద్ద ఆశ్రయం పొందుతున్న వీధికుక్కే ఆమెపై దాడి చేసి గాయపరిచింది. ఈ దిగ్బ్రాంతికర ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. చివరకి తన చేతిని కూడా కోల్పోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తాను ఆ వీధి కుక్కను తీసుకొచ్చి షెల్టర్‌లో ఉంచేంతవరకు కూడా చాలా రోజుల వరకు నార్మల్‌గానే ఉందని. మరో కుక్కతో గొడవ పడవడంతో ఒక్కసారిగా కర్కశంగా మారి ఇలా తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చారు మునోజ్‌. అయితే ఈ దాడిలో ఈ కుక్క తన చేతిపై ఘోరంగా దాడి చేయడంతో స్ప్రుహతప్పి పడిపోయానని తెలిపింది.

ఆ తర్వాత తాను ఆస్పత్రిలోనే నెల రోజులపాటు ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. అంతేగాదు తాను చాల రోజుల వరకు కోమాలో ఉన్నట్లు పేర్కొంది. అయితే కుక్క దారుణంగా దాడి చేయండంతో తీవ్ర  ఇన్ఫెక్షన్‌కి గురై తన కుడి చేతిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించిది. ఈ ఘటన వల్ల తాను ఇంతలా బాధ పడినప్పటికీ ఆ కుక్కను మాత్రం నిందించనని చెబుతోంది. ఇది విషాదంతో కూడిన గొప్ప అనుభవం, పైగా మరొకరికి తన అనుభవం పనికొస్తుందని చాలా సమన్వయ దృక్ఫథంతో మాట్లాడింది. కాగా, సదరు మహిళ ఎన్నో వీధికుక్కలకు, పిల్లులకు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తుంది.

ప్రతి పైసా కూడా వాటి సంరక్షణ కోసం ఖర్చుపెడుతుందని గో ఫండ్‌ మీ అనే స్వచ్ఛంద వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌లో అమానుషంగా గాయపడినవారు లేదా నయంకానీ వ్యాధితో బాధపడుతున్నవారికి సాయం అందించే స్వచ్ఛంధ వెబ్‌సైట్‌. ఇలాంటి ఘటనలు మనుషుల నుంచి కూడా ఎదురవ్వుతాయి. ఇక్కడ జంతువులకు విచక్షణ జ్ఞానం ఉండదు, పైగా వాటికున్న సహజగుణంతో దాడి చేయడం జరగుతుంది. కానీ అన్నీ తెలిసిన మనుషులు సైతం జంతువుల కన్న ఘోరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కోకొల్లలు. సాయం చేసిన వారికే వెన్నుపోటు పొడడవడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తారు కొందరు దుర్మార్గులు. ఇలాంటి ఘటనల కారణంగా ఒక్కసారిగా మంచిగా ఉండేవారు సైతం చెడ్డగా మారిపోతుంటారు.

ఇక్కడ సమన్వయంతో కూడిన సానుకూలద ృక్పథాన్ని పెంపొందించుకోవడానికి యత్నించాలి. అంతేగాదు  హాని చేసే అలవాటు వారిదే గానీ నాది కాదు అని మనస్తతత్వాన్ని అవరచుకోవాలేగానీ ప్రతి ఘటనకు పాల్పడకూడదు. ఇలా వ్యవహరిస్తే ఏదో ఒక రోజు ఆయా మనుషుల్లో పశ్చాతాపంతో కూడిన మార్పు తప్పక వస్తుంది. ఆ చేదు ఘటనలతో మన వైఖరి మారిపోకూడదనే విషయం ఈ మహిళ వ్యవహరించిన తీరు చెప్పకనే చెబుతోంది కదూ!.

(చదవండి: ఎవరీ ఉ‍మ్ముల్‌ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు అయినా..)

Advertisement
Advertisement