ఐడియల్‌ వీకెండ్‌: పాపం వారమంతా ఎంతకష్టపడిందో..!

24 Oct, 2021 16:47 IST|Sakshi

వారమంతా కష్టపడి పనిచేసి.. ఆదివారం రాగానే ఈసురో మంటూ మంచానికి అతుక్కుపోతాం. కానీ వీకెండ్‌ ఎంజాయ్‌ చేయడం కూడా ఓ కళ.. అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది రకరకాలుగా రిలాక్స్‌ అవ్వడం చూస్తూనే ఉన్నాం..! ఐతే ఈ మధ్య కుక్కలు కూడా వీకెండ్‌ ఆచారాన్ని పాటిస్తున్నాయేమో అనే డౌట్‌ వస్తుంది ఈ వీడియో చూస్తే.

బాబీ ది కార్గీ అనే యూజర్‌ పేర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆరుబయట స్వింగ్‌ చైర్‌లో చారగిల పడుకుని, కళ్లపై కీర స్లైస్‌ పెట్టుకుని, పైన బెడ్‌షీట్‌ కప్పుకుని రిలాక్స్‌గా పడుకున్న కుక్క ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘మై కైండ్‌ ఆఫ్‌ వీకెండ్‌’ అనే క్యాప్షన్‌తో, నిద్రపోతున్న ముఖంతో కనిపిస్తున్న ఈ శునకానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు వేలల్లో తెగ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..

నేను కూడా నీతో జాయిన్‌ అవ్వొచ్చా? చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నావ్‌ అని ఒకరు, ఇంత క్యూట్‌నెస్‌గా మేము కూడా ఎంజాయ్‌ చేయలేం.. అని మరొకరు, ఎంత పాంపర్డ్ లైఫ్!! నువ్వు దానికి అర్హురాలివని ఇంకొకరు హార్ట్‌ ఎమోజీలతో సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెప్టెంబర్ 11న షేర్‌చేసిన పాత వీడియో అయినప్పటికీ.. తాజాగా నెట్టింట ఈ పోస్ట్‌ మళ్లీ వెరల్‌ అవ్వడంతో.. లక్షల్లో ఈ వీడియోను వీక్షిస్తున్నారు.

చదవండి: అమెజాన్‌లో ఐఫోన్‌ 12 ఆర్డర్‌ చేశాడు.. పార్సిల్‌ ఓపెన్‌ చేస్తే..లబోదిబో!!

A post shared by 9GAG: Go Fun The World (@9gag)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు