What Came First Chicken Or Egg, At Long Last Scientists Solve This - Sakshi
Sakshi News home page

What Came First Egg Or Chicken: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు

Published Sat, Jun 17 2023 4:29 PM

What Came First Chicken Or Egg At Long Last Scientists Solve This - Sakshi

కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్‌ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్‌లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు  శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. 

ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్‌) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ  అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు.

పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉ‍న్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్‌(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

(చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..)

Advertisement

తప్పక చదవండి

Advertisement