Nagula Chavithi 2022: నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..

29 Oct, 2022 11:06 IST|Sakshi

Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది.
చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా!

ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు