అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం! | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!

Published Wed, Sep 6 2023 12:20 PM

Worlds Most Expensive Coffee Made From Poop Of Civet Cat - Sakshi

కాఫీ గుమగుమలు ముక్కు పుటలకు తాకగానే అబ్బా అనేస్తాం. పొద్దున్నే ఓ కప్పు కాఫీ పొట్టలో పడితే గానీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించదు. అలాంటి కాఫీ ప్రియులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఉందని తెలుసా!. ఐతే దాన్ని ఎలా తయారచేస్తారో వింటే మాత్రం..ఛీ యాక్‌ అంటారు. కానీ ఆ కాఫీ చాలా రుచిగా ఉండటానికి కారణం వాటివల్లనేట. ఆ కాఫీ తయారయ్యే విధానం తెలిస్తే మాత్రం..అమ్మబాబోయ్‌! అంటూ జోలికి వెళ్లే సాహసం చేయలేం. విచిత్రం ఏంటంటే ఆ కాఫీకి ఉన్న డిమాండ్‌ చూస్తే వామ్మో! అంటారు.

కోపి లువాక్‌ లేదా సివెట్‌ కాఫీ ప్రంపచంలోనే అత్యంత ఖరిదైన కాఫీగా ప్రసిద్ధిచెందింది. దీన్ని ఎలా తయారు చేస్తారో వింటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం నిశబ్దంగా ఉండిపోతాం. దీని ధర ట్యాగ్‌ వెనుకు ఉన్న రహస్యం తెలుసుకుంటే షాకవ్వడం గ్యారంటీ.

ఎలా తయారు చేస్తారంటే..
కోపి లువాక్‌ అనే కాఫీ ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి నుంచి ఉద్భవించింది. ఇది కాఫీ చెర్రీస్‌ అనే పండ్ల నుంచి తయారవ్వుతుంది. అయితే ఆ పండ్లను సేకరించి నేరుగా తయారు చేసేయ్యరు. ఆ కాఫీ చెర్రీలను పునుగు పిల్లి(ఆంగ్లంలో (సివెట్‌) అనే పిల్లి జాతి క్షీరదం తింటుందట. ఆ తర్వాత వాటి గింజలను విసర్జిస్తుతుంది. కాఫీ ఉత్పత్తిదారులు అది విసర్జించిన గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారు.

నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని ఈ పునుగు పిల్లులు తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్‌లు బీన్స్‌ నేచర్‌ని మారుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే వాటి చేదు గుణాన్ని తగ్గించి వాటిని రుచిగా మారుస్తాయి. ఈ సహజ కిణ్వనప్రక్రియే కోలి లువాక్‌ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. 


                                          సేకరించిన పునుగు పిల్లి విసర్జకాలు

ఎందుకింత ఖరీదంటే..
ఈ కాఫీ ఎందుకింత ఖరీదైందిగా పేరుగాంచిందంటే ఈ కాఫీ బీన్స్‌  సంప్రదాయంగా పండించడానికి బుదులుగా ఈ సివెట్‌(పునుగు పిల్లుల) రెట్లను సేకరించడం ద్వారానే తయారవ్వుతుంది కాబట్టి. ఉత్పత్తిదారులకు ఇది అధిక ఖర్చులకు దోహదం చేసే అంశం. ఇక సివెట్‌ తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలనే విసర్జిస్తాయి. దీంతో పరిమిత స్థాయిలోనే సరఫరా ఉండటంతో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జక పదార్థాలతో తయారవుతుందనే దృష్ట్యా ఈ కాఫీపై పలు విమర్శలు కూడాఉన్నాయి. 

ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ తాగాలనుకునేవారికి ఈ కాఫీ ఒక స్టేటస్‌ ఆఫ్‌ సింబల్‌గా ఉంటుంది. ఈ కాపీ తయారీ కోసమనే ఈ పునుగు పిల్లలను బంధిస్తున్నారని జంతుప్రేమికుల నుంచి విమర్మలు కూడా ఉన్నాయి. ఈ కోపీ లువాక్‌ కాఫీ ఖరీదు, విలక్షణమైన తయారీ విధానం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా ఉంటుందట.

(చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..)

Advertisement
Advertisement