Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్‌! యూత్‌కు దగ్గరైన జానర్‌లలో అగ్రస్థానంలో ఉన్నది ఏమిటంటే!

7 Oct, 2022 19:26 IST|Sakshi

పాడ్‌కాస్ట్‌ పథంలో....

కోవిడ్‌ టైమ్‌లో యూత్‌కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్‌కాస్ట్‌’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్‌కాస్టింగ్‌లో పాటలు ఒక భాగం మాత్రమే.

‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్‌ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్‌ స్టోరీస్‌లాంటి ట్రావెల్‌ పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత.

నాగ్‌పుర్‌కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్‌కాస్ట్‌ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్‌కాస్ట్‌కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

యూత్‌కు దగ్గరైన పాడ్‌కాస్ట్‌ జానర్‌లలో ‘మెంటల్‌ హెల్త్‌’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్‌కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్‌’ ‘ఎమోషనల్‌ ఫీల్‌’ ‘బుద్ధిస్ట్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ లైఫ్స్‌ ప్రాబ్లమ్స్‌’....మొదలైన పాడ్‌కాస్ట్‌లు వింటూ ఉంది.

ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్‌కు స్ట్రెస్‌ బస్టర్‌గా పాడ్‌కాస్టింగ్‌ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్‌కాస్టింగ్‌ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్‌.

చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు!  

మరిన్ని వార్తలు