డీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నిర్మలారాణి | Sakshi
Sakshi News home page

డీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నిర్మలారాణి

Published Sun, Mar 19 2023 1:24 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎస్‌. నిర్మలారాణిని ఉద్యోగోన్నతిపై అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అడ్‌హక్‌ పద్ధతిలో నియమిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెకు తిరిగి అదే కార్యాలయంలో అడ్‌హక్‌ పద్ధతిపై ఏడీగా నియమించారు.

పెదనందిపాడులో 30.4 మి.మీ వర్షం

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా పెదనందిపాడు మండలంలో 30.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తెనాలి మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 5 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు 18.2, గుంటూరు తూర్పు 11.2, కాకుమాను 11.2, పొన్నూరు 10.8, వట్టిచెరుకూరు 4.2, గుంటూరు పశ్చిమలో 2.6 మి.మీ చొప్పున వర్షం పడింది.

Advertisement
Advertisement