మాతృ మరణాలపై సమీక్ష | Sakshi
Sakshi News home page

మాతృ మరణాలపై సమీక్ష

Published Fri, Nov 10 2023 5:20 AM

-

గుంటూరు మెడికల్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు చాంబర్‌లో సర్వేలెన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సబ్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ సర్వేలెన్స్‌ సమీక్ష కార్యక్రమం గురువారం జరిగింది. సమీక్షలో జిల్లాలో అక్టోబర్‌ మాసంలో జరిగిన మాతృమరణాలపై సమీక్షించారు. కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామానికి సంబంధించి ఒక మాతృమరణానికి గల కారణాలను కమిటీ సభ్యులు సమీక్షించి నివారించలేని మరణంగా నిర్ధారించారు. గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు వరకు ప్రతి గర్భిణీని ఆరోగ్య కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారి పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రతీ గర్భిణి రక్తహీనతకు గురికాకుండా, మధుమేహం, రక్తపోటును కాన్పు అయ్యేంతవరకు సమీక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మాతృ మరణాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. డీపీఎంఓ డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement