క్రీడలకు అధిక ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

క్రీడలకు అధిక ప్రాధాన్యం

Published Sun, Nov 19 2023 1:36 AM

 మాట్లాడుతున్న ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి  - Sakshi

పెదకాకాని: రాష్ట్రప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని, క్రీడాభివృద్ధికి ప్రభు త్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి అన్నారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్‌ పాఠశాలలో మూడు రోజులు జరగనున్న అండర్‌–14 బాల బాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల కార్యక్రమానికి హెచ్‌ఎం నంబూరు తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలనూ ప్రోత్సహిస్తుందన్నారు. తొలుత జాతీయ జెండా, గేమ్స్‌ జెండా ఎగురవేశారు. జిల్లాల వారీగా 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్ల కార్డులు, జెండాలతో మార్చ్‌ఫాస్ట్‌ చేశారు. చివరిగా క్రీడా ప్రతిజ్ఞ అనంతరం క్రీడలు ప్రారంభించడం జరిగింది. ఏపీ టెస్ట్‌ బుక్స్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ మస్తాన్‌రెడ్డి, డాక్టర్‌ ఎస్‌కే మహబూబ్‌ బాషా, ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ ప్రతాపరెడ్డి, శివాలయం చైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకరరావు పాల్గొన్నారు.

వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్‌లో

ప్రారంభమైన రాష్ట్రస్థాయి

సాఫ్ట్‌బాల్‌ పోటీలు

పోటీలను ప్రారంభించిన

ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి

Advertisement
Advertisement