‘చలపతి’కి ఎడ్యుస్కిల్‌ అవార్డులు | Sakshi
Sakshi News home page

‘చలపతి’కి ఎడ్యుస్కిల్‌ అవార్డులు

Published Sat, Nov 25 2023 1:40 AM

ఎడ్యుస్కిల్‌ సంస్థ అవార్డులు 
అందుకుంటున్న ప్రిన్సిపల్‌  - Sakshi

తాడికొండ: మోతడక చలపతి ఇంజినీరింగ్‌ కళాశాల అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వివిధ వ్యక్తిగత– సంస్థగత అవార్డులను ఎడ్యుస్కిల్‌ సంస్థ నుంచి అందుకున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ తెలిపారు. వివిధ విభాగాలలో ఏఐసీటీఈ, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు, ఎడ్యుస్కిల్స్‌ ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు ఆలిండియా ఎడ్యుస్కిల్స్‌ వర్‌ుచ్యవల్‌ ఇంటర్న్‌షిప్‌ 2023 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడమే కాక అకడమిక్‌ క్రెడిట్‌ ఫర్‌ ఇంటర్న్‌షిప్‌ అవార్డు 2023, ఎడ్యుస్కిల్స్‌–ఏడబ్లుస్‌ అకాడమీ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఇనిస్టిట్యూట్‌ 2023, ఏఐసీటీఈ, ఎడ్యుస్కిల్స్‌ అధిక సంఖ్యలో ఇంటర్న్‌షిప్‌ అందించిన కళాశాలగా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చోటు సంపాదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డుల సాధనకు కృషి చేసిన ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.నాగ శ్రీనివాసరావు, ఆర్‌ అండ్‌ డీ డీన్‌ డాక్టర్‌ పి.బాల మురళీ కృష్ణ, వివిధ విభాగాధిపతులను చైర్మన్‌ వైవీ ఆంజనేయులు, కరస్పాండెంట్‌ వై.సుజిత్‌ కుమార్‌లు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement