నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం | Sakshi
Sakshi News home page

నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

Published Tue, Nov 28 2023 2:20 AM

వెంకటేశ్వరరావు, గుంటూరు డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి - Sakshi

గుంటూరుఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గుంటూరు డివిజన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు గుంటూరు డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని 107 ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్‌, గురుకుల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల్లో అధిక మార్కుల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదనపు తరగతుల నిర్వహణతోపాటు విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించినట్లు చెప్పారు. సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి, అవసరమైన ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్నారు. డివిజన్‌ పరిధిలోని ఉన్నత పాఠశాలల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తూ, అకడమిక్‌ పరంగా ప్రగతి, ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారిని ప్రతి రోజూ పాఠశాలకు పంపే విధంగా ఉపాధ్యాయులు ప్రేరణ కల్పిస్తున్నారని చెప్పారు.

Advertisement
Advertisement