డీఆర్‌ఎం కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఎం కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

Published Tue, Nov 28 2023 2:20 AM

ప్రతిజ్ఞ చేస్తున్న డీఆర్‌ఎం రామకృష్ణ   - Sakshi

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): ప్రతిఏటా నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని డివిజన్‌ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని రైల్వే డివిజన్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో సోమవారం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సంగా ప్రకటించడం జరిగిందన్నారు. దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యమని రాజ్యంగ ప్రవేశిక వివరిస్తోందన్నారు. ఆదేశిక సూత్రాలు న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, ప్రజలందరికీ సాంఘిక ఆర్ధిక రాజకీయ న్యాయం చేకూరాలని కోరడం జరిగిందన్నారు. భారత రాజ్యంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఇవ్వడంతో పాటు నిమ్నకులాలకు బలహీన వర్గాలకు, మహిళలకు అల్ప సంఖ్యాకులకు ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞను సంబంధిత అధికారులతో కలిసి చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ అధికారులు సీనియర్‌ డీపీఓ హనూర్‌, ఏడీఆర్‌ఎం పాల్గొన్నారు.

Advertisement
Advertisement