నాణ్యత, మన్నికకు కేరాఫ్‌ భారతి సిమెంట్‌ | Sakshi
Sakshi News home page

నాణ్యత, మన్నికకు కేరాఫ్‌ భారతి సిమెంట్‌

Published Tue, Dec 19 2023 1:28 AM

మేస్త్రికి బీమా బాండ్‌ అందిస్తున్న 
కాసు మల్లారెడ్డి, సురేష్‌, భవానీశంకర్‌   - Sakshi

అసిస్టెంట్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) పూల సురేష్‌, సీనియర్‌ టెక్నికల్‌ అధికారి ఎన్‌.భవానీ శంకర్‌

నగరంపాలెం: అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్‌ తయారవుతోందని భార తి సిమెంట్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) పూల సురేష్‌, సీనియర్‌ టెక్నికల్‌ అధికారి ఎన్‌.భవానీ శంకర్‌ అన్నారు. సోమవారం రాత్రి గుంటూరులోని శ్రీ కీర్తిసాయి ఎంటర్‌ప్రైజెస్‌ సహకారంతో భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యాన భవన నిర్మాణ మేస్త్రిలు, కార్మికులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పూల సురేష్‌ మాట్లాడు తూ శాశ్వతమైన భవన నిర్మాణాలకు సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సిమెంట్‌ను ఎంపిక చేసుకోవాలన్నారు. కట్టడాలు, నిర్మాణాలు పూర్తి నాణ్యతతో ఉంటాయని, తద్వారా దీర్ఘకాలం మన్నేందుకు దోహదపడుతుందని చెప్పారు. సిమెంట్‌ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే తమ కంపె నీ మొదటి నుంచి ఎంపిక చేసుకుంటుందని పేర్కొన్నారు.

సీనియర్‌ టెక్నికల్‌ అధికారి భవానీశంకర్‌ మాట్లాడుతూ భారతి సిమెంట్‌తో నిర్మితమైన కాంక్రీట్‌ శ్లాబ్‌లను ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులొచ్చి నాణ్యతా పరీక్షలు చేసి, తద్వారా భారతి సిమెంట్‌ నాణ్యత, మన్నికను భవన నిర్మాణ మేస్త్రిలు, యాజమానులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. దీని కోసం సంబంధిత డీలర్లను సంప్రదిస్తే అనంతరం తమకు సమాచారం చేరవేస్తారని పేర్కొన్నారు. అనంతరం మేస్త్రిల సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో మేస్త్రిలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించిన బాండ్లను అందించారు. సదస్సులో శ్రీ కీర్తి సాయి ఎంటర్‌ప్రైజెస్‌ యాజమాని కాసు మల్లారెడ్డి, ఇతర డీలర్లు, భవన నిర్మాణ మేస్త్రిలు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement