నేడు ట్రాఫిక్‌ మళ్లింపు | Sakshi
Sakshi News home page

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

Published Fri, Jan 19 2024 1:56 AM

- - Sakshi

నగరంపాలెం: విజయవాడలో శుక్రవారం 206 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి గుంటూరు నగర పరిసరాలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు చేపడుతున్న ఈ మార్పులు గమనించి విజయవాడ వైపు వెళ్లే ప్రతి వాహనదారుడు సహకరించాలని కోరారు.

● గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు జంక్షన్‌ వద్ద హైవే దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్‌, పెనుమూడి బ్రిడ్జి, అవనిగడ్డ, పామూరు – గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ (ఇరువైపుల) మీదగా వెళ్లాలి.

● బాపట్ల వైపు వెళ్లే వాహనాలు బోయపాలెం, ప్రత్తిపాడు మీదుగా బాపట్ల వెళ్లాల్సి ఉంది.

● గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను విజయవాడలోకి అనుమతించరని, బోయపాలెం సర్వీస్‌ రోడ్‌లో నిలుపుదల చేసుకోవాలి.

● గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్‌ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి. విజయవాడ వైపు అనుమతించరు.

● చిలకలూరిపేట నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు చిలకలూరిపేట వై.జంక్షన్‌ (గుంటూరు) నుంచి చుట్టుగుంట, పేరేచర్ల మీదుగా వెళ్లాలి.

● మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు రేవేంద్రపాడు జంక్షన్‌ మీదుగా తెనాలి, భట్టిప్రోలు, పెనుమూడి ఫ్లై ఓవర్‌ మీదుగా విజయవాడ వైపు వెళ్లాలి.

● అత్యవసర వాహనాలు/ విగ్రహావిష్కరణకు వెళ్లే వాహనాలు ఏ దారి నుంచైనా విజయవాడ వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రతి వాహనదారుడు పోలీసులకు సహకరించాలని కోరారు.

విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లాలో ట్రాఫిక్‌ మళ్లింపు అత్యవసర వాహనాలకు అనుమతి

Advertisement
Advertisement