పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి | Sakshi
Sakshi News home page

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Published Tue, Mar 14 2023 1:30 AM

-

కాళోజీ సెంటర్‌: ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఆర్జేసీ జయప్రదబాయితో కలిసి జిల్లా కలెక్టర్లు, ఇంటర్మీడియట్‌ అధికారుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రతీ జిల్లాలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని, రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీమానస్‌ టోల్‌ఫ్రీ నం.14416ను ఏర్పాటు చేసిందని తెలిపారు. కలెక్టర్‌ గోపి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు 27 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, 14,005 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం కంట్రోల్‌ రూంలో నం.89770 81640 ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీవత్స, డీఐఈఓ కాక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

వీసీలో విద్యాశాఖ మంత్రి

సబితా ఇంద్రారెడ్డి

Advertisement
Advertisement