మార్చ్చురీలో అనధికార సిబ్బంది | Sakshi
Sakshi News home page

మార్చ్చురీలో అనధికార సిబ్బంది

Published Thu, Jun 1 2023 1:36 AM

-

ఎంజీఎం : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం మార్చురీకి ఎన్ని మృతదేహాలు వస్తున్నాయి.. ఏ యే సమయాల్లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. మార్చురీలోని వసతులను పరిశీలించిన ఆయన సిబ్బంది అటెండెన్స్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అధికారికంగా ముగ్గురు సహాయక సిబ్బంది పనిచేయాల్సి ఉండగా.. డీఎంఈ తనిఖీ సమయంలో మార్చురీలో 10 నుంచి 15 మంది సహాయక సిబ్బంది విధుల్లో కనిపించగా.. వేతనాలు లేకుండా ఇక్కడ ఏలా పనిచేస్తున్నారని ప్రశ్నించిన డీఎంఈ.. ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌లతో పాటు ఎంజీఎం పరిపాలనాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మార్చురీలో అవినీతిని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. వీరంతా ఏన్ని రోజుల నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారనే విషయమై ఆరా తీశారు. సిబ్బంది అవసరమైతే ప్రతిపాదనలు పంపాలే తప్ప సొంత నిర్ణయాలతో ప్రభుత్వాస్పత్రులకు చెడ్డ పేరు తేకూడదని హెచ్చరించారు.

నేడు విద్యార్థి సంఘాలతో

సీపీ ఇంటరాక్షన్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులతో గురువారం ఉదయం 10 గంటలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ ఇంటారక్షన్‌ కానున్నారు. క్యాంపస్‌లోని పరిపాలనా భవనం సేనేట్‌హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో యూనివర్సి టీ, విద్యార్థుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు కేయూ పోలీస్‌ స్టేషన్‌, కేయూ అధికారులు విద్యార్థి నాయకులు, విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు పాల్గొననున్నారు.

Advertisement
Advertisement