పదేళ్ల పండుగకు వేళాయె.. | Sakshi
Sakshi News home page

పదేళ్ల పండుగకు వేళాయె..

Published Fri, Jun 2 2023 2:50 AM

- - Sakshi

హన్మకొండ అర్బన్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సాధించుకుని పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలిరోజు హనుమకొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీస్‌ వందనం స్వీకరించనున్నారు. పదేళ్ల పండుగలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజల కు వివరించనున్నారు. రాష్ట్రం సిద్ధించాక చేపట్టి న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అమరుల యాది, తెలంగాణ నాడు–నేడు కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేయనున్నారు.

నగరం ముస్తాబు..

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు విద్యుత్‌ కాంతులతో విరాజిల్లుతున్నాయి. అధికారిక వేడుకలకు పరేడ్‌ గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. అమరవీరుల స్తూపం, కలెక్టరేట్‌, కలెక్టర్‌ నివాసం, అమరవీరుల కీర్తి స్తూపం రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పతాక ఆవిష్కరణ చేయనున్నారు.

ఉత్సవాల్ని విజయవంతం చేయండి :

కలెక్టర్‌ ప్రావీణ్య

కరీమాబాద్‌: దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికా రులతో పాటు ప్రజలూ భాగస్వాములు కావా లన్నారు. తూర్పు నియోజకవర్గ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై హంటర్‌రోడ్‌ గోల్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ ప్రావీ ణ్య మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పా రు. కార్యక్రమాల పర్యవేక్షణకు నోడల్‌ అధికా రులను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితానా జీ వాకడే, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, మేయర్‌ గుండు సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, ఏసీపీ బోనాల కిషన్‌, వివిధ శాఖల అధికారులున్నారు.

గ్రేటర్‌లో విస్తృత ఏర్పాట్లు

వరంగల్‌ అర్బన్‌: దశాబ్ది వేడుకల నిర్వహణకు మహా నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం విస్త్రత ఏర్పాట్లు చేపట్టింది. గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాలు, కలెక్టర్‌ బంగ్లా, ఖిలా వరంగల్‌లోని ఖుష్‌ మహల్‌, రైల్వేస్టేషన్‌, ఎంజీఎం ఆస్పత్రి, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ దీపాల అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాయంలో శుక్రవా రం ఉదయం జరిగే ఉత్సవాలకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని మేయర్‌ సుధారాణి, కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషాలు ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో..

వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఉదయం 8:40 నిమిషాలకు ఖిలా వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత వరంగల్‌ ఐడీఓసీ గ్రౌండ్‌లో 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. ఈకార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీంతో దశాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయి.

విద్యుత్‌ వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్‌

నేటి నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ప్రభుత్వ కార్యాలయాలకు

దీపకాంతులు

నేడు పరేడ్‌ గ్రౌండ్‌లో పతాకాన్ని ఆవిష్కరించనున్న చీఫ్‌విప్‌

అమరుల యాది.. తెలంగాణ నాడు–నేడు కార్యక్రమాలు

ప్రభుత్వ పథకాలపై

విస్తృత ప్రచారం

విద్యుత్‌ వెలుగుల్లో బల్దియా కార్యాలయం
1/2

విద్యుత్‌ వెలుగుల్లో బల్దియా కార్యాలయం

ఉత్సవాల లోగో ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌
2/2

ఉత్సవాల లోగో ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

Advertisement
Advertisement