ఎన్‌ఎంఎంఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఎంఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

Published Sun, Oct 15 2023 1:34 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ అబ్దుల్‌హై శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌, మోడల్‌ స్కూల్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పరీక్ష ఫీజు, ఇతర వివరాలకు హెచ్‌టీటీపీ//బీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్‌.ఇన్‌ను చూడాలని సూచించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

టీఎస్‌ఎస్పీ కమాండెంట్‌గా

శివప్రసాద్‌రెడ్డి

మామునూరు: ఖిలా వరంగల్‌ మండలం మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగు, ఐదు బెటాలియన్ల నూతన కమాండెంట్‌గా నియమితులైన శివప్రసాద్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతకాలం పనిచేసిన సింధుశర్మ కామారెడ్డి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాతకొండ టీఎస్‌ఎస్పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న శివప్రసాద్‌రెడ్డి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్‌రెడ్డి, బదిలీపై వెళ్తున్న సింధుశర్మను బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు జయరాం, వేణుగోపాల్‌రెడ్డి, రాంబాబు, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌ఐలు శోభన్‌, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, అశోక్‌ ఉద్యోగ సంఘాల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సోమయ్య వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రతిభ

కాశిబుగ్గ: బీహర్‌ రాష్ట్రం దానాపూర్‌ డివిజన్‌లో జరిగిన ఆల్‌ ఇండియా ఆర్పీఎఫ్‌ షూటింగ్‌ పోటీల్లో వరంగల్‌ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రజినీకుమార్‌ గోల్డ్‌ మెడల్‌, సిల్వర్‌ మెడల్‌ సాధించారు. శని వారం ఆయనను వరంగల్‌ ఆర్పీఎఫ్‌ సీఐ టీఎ స్‌ఆర్‌ కృష్ణ, ఏఎస్‌ఐ నరేందర్‌ అభినందించారు.

సీపీని కలిసిన కలెక్టర్లు

కాజీపేట: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అంబర్‌ కిశోర్‌ ఝాను శనివారం రాత్రి వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‌ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. సీపీకి అభినందనలు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేలా.. కలిసికట్టుగా పని చేద్దామన్నారు.

ప్రభుత్వ వైఫల్యంతో

నిరుద్యోగులకు నిరాశ

కాజీపేట: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే.. యువత ఉద్యోగావకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శనివారం అఖిలపక్షం నాయకులు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వకుండా అఖిలపక్షం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గేటుకు వినతిపత్రం అంటించి నిరసన తెలిపారు. ఆందోళనలో పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, అప్పారావు, మేకల రవి, కర్రె భిక్షపతి, రహీమున్నిసా బేగం, రాహుల్‌రెడ్డి, సతీశ్‌, నాయిని లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

1/2

2/2

Advertisement
Advertisement