పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

Published Sat, Nov 11 2023 1:34 AM

-

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులు, స్టేషన్‌ నిర్వహణ, ఎన్నికల విధులు, బందోబస్తుకు చేపడుతున్న చర్యలు, రౌడీషీటర్ల బైండోవర్లు, కౌన్సెలింగ్‌ తదితర అంశాలపై సీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుబేదారిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి అక్కడ నమోదవుతున్న కేసులతో పాటు మహిళాల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు ఇన్‌స్పెక్టర్‌ సువర్ణను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళా ఫిర్యాదుతో సీపీ ముచ్చటించారు. ఈతనిఖీల్లో హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్‌, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ షూకుర్‌, మహిళా స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణ, ఎస్సై సాయి దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement