పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Thu, Nov 16 2023 1:24 AM

మాట్లాడుతున్న హెచ్‌ఎన్‌ గోపాలకృష్ణ  - Sakshi

గురువారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌ హెచ్‌.ఎన్‌ గోపాలకృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బంది రెండో ర్యాండమైజేషన్‌ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈసందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 789 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 3,788 మందిని రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో 947 మంది పీఓలు, 947 మంది ఏపీఓలు, 1,894 మంది ఓపీఓలు ఉన్నారన్నారు. ప్రతీ టీంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఇద్దరు ఇతర పోలింగ్‌ ఆఫీసర్లు ఉంటారని వివరించారు. నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 5 మహిళా టీంలు, ఒక యూత్‌ టీం, ఒక దివ్యాంగుల టీం ఎంపిక చేసినట్లు, వీరికి శిక్షణ ఇచ్చి హోం ఓటింగ్‌కు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ట్రెయినీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్ల, సీపీఓ సత్యనారాయణ, ఎన్‌ఐసీ అధికారి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

1/1

Advertisement
Advertisement