ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం

Published Fri, Nov 17 2023 1:16 AM

శ్రీరాములపేటలో కౌశిక్‌రెడ్డి ప్రచారం - Sakshi

● కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కష్టాలే ● బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి

వీణవంక/హుజూరాబాద్‌రూరల్‌: ఏడుసార్లు ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమిలేదని, రెండేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని కొనియాడారు. మండలంలోని శ్రీరాములపేట, కోర్కల్‌, నర్సింహులపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో కౌశిక్‌రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నది కేవలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గెలిచాక మేని ఫెస్టోను అమలు చేస్తామన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. కౌశిక్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాలసాదవరెడ్డి, సంది సమ్మిరెడ్డి, రాకేశ్‌, తిరుపతి గౌడ్‌, మద్దుసాని సమ్మయ్య, దూలం సమ్మయ్య, తదితరులు

సీఎం సభను విజయవంతం చేయాలి

జమ్మికుంట పట్టణంలో 17న నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని, ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరయ్యే సభకు ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ విజయానికి బాటలు వేస్తాయన్నారు. హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌, నాయకుడు, సామాజిక సహాయకర్త వర్ధినేని రవీందర్‌రావు, పంజాల కుమారస్వామి, దొంత రమేశ్‌, సందమల్ల బాబు, మైకెల్‌, దిల్‌ శ్రీనివాస్‌, రాజా, మల్లారెడ్డి, మోరె మధు, తదితరులు ఉన్నారు. ఉన్నారు.

బీఆర్‌ఎస్‌లోకి చేరిక

మండలంలోని రాంపూర్‌ గ్రామంలో బీజేపీకి చెందిన 30 మంది యువకులు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు తొగరు శివకృష్ణ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బండ శ్రీనివాస్‌
1/2

సమావేశంలో మాట్లాడుతున్న బండ శ్రీనివాస్‌

కండువాలు కప్పుతున్న తొగరు శివకృష్ణ
2/2

కండువాలు కప్పుతున్న తొగరు శివకృష్ణ

Advertisement
Advertisement