రైతులకు న్యాయం చేయాలి | Sakshi
Sakshi News home page

రైతులకు న్యాయం చేయాలి

Published Sun, Dec 24 2023 1:12 AM

గవర్నర్‌కు ఆల్బమ్‌ అందజేస్తున్న యశ్వంత్‌  - Sakshi

హన్మకొండ: సన్న, చిన్నకారులు, కౌలు రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం సలహాదారుడు ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట నారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం హనుమకొండ బాలసముద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో 8000 మందికి పైగా కౌలు, సన్న, చిన్న కారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు ద్వారా రూ.65 వేల కోట్లు పంపిణీ చేసినప్పటికీ... ఇందులో రూ.40 వేల కోట్లు సొమ్ము భూస్వాములు, కార్పొరేట్‌ సంస్థల యజమానులు, రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు, జమీందారులకు మాత్రమే చేరిందని వివరించారు. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్న, సన్న కారు, కౌలు రైతులకు న్యాయం జరిగేలా విధానాలు రూపొందించాలన్నారు. వ్యవసాయ మార్కెట్లలో అవినీతి జరగకుండా నియంత్రించాలన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతు రుణాలు మాఫీ చేసి చిన్న, సన్నకారు రైతులను రుణ విముక్తులను చేయాలని కోరారు. వివిధ పంటలకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నదాతల ఆత్మహత్యలు ఉండొద్దని, రైతు సంక్షేమం వర్థిల్లాలని ఆకాంక్షించారు. సమావేశంలో రైతు నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్‌, వొడెల రాజన్న, సిరుల రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ను కలిసిన యశ్వంత్‌

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటెయినర్‌ భూక్యా యశ్వంత్‌ శనివారం ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల ఆస్ట్రేలి యాలోని ఎత్తైన కోజిస్కోన్‌ పర్వతాన్ని అధి రోహించి శిఖరంపై భారతదేశ పతాకం ఎగరవేసినట్లు గవర్నర్‌కు వివరించారు. అలాగే, త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అ ధిరోహించనున్నట్లు గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌.. యశ్వంత్‌ ను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రైతు సంఘం సలహాదారుడు వెంకటనారాయణ

మాట్లాడుతున్న వెంకట నారాయణ
1/1

మాట్లాడుతున్న వెంకట నారాయణ

Advertisement
Advertisement