గంటకు ఘన చరిత్ర.. | Sakshi
Sakshi News home page

గంటకు ఘన చరిత్ర..

Published Sun, Dec 24 2023 1:12 AM

హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చిలో 
ఏర్పాటు చేసిన బెల్‌  - Sakshi

హన్మకొండ కల్చరల్‌ : హనుమకొండలోని సెంటినరీబాప్టిస్ట్‌ చర్చిలో ఉన్న బెల్‌ (గంట)కు వంద సంవత్సరాలకు పైబడిన ఘనచరిత్ర ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ చైతన్యంతో అమెరికాలో ఎంతో శాస్త్రసాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. పారిశ్రామిక చైతన్యం పెంపొందించిన వారిలో బెంజిమెన్‌ హంక్స్‌ ఒకరు. ఇతడు అమెరికా సైన్యంలో డ్రమ్మర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అలాగే, లిచ్‌ఫీల్డ్‌లో మొదట తన కర్మాగారం ప్రారంభించి చర్చి బెల్స్‌ తయారు చేశాడు. తరువాత తన కుమారుడు జ్యూలియస్‌హంక్స్‌తో కలిసి మ్యాన్స్‌ఫీల్డ్‌, వెస్ట్‌రాయ్‌లలో పెద్ద కర్మాగారాలు స్థాపించాడు. ఇక్కడ అప్రంటీస్‌గా చేరిన అండ్రిమేన్‌లీ.. బెంజిమెన్‌హంక్స్‌ మనవరాలిని పెళ్లి చేసుకుని ఆ తరువాత న్యూయార్క్‌లోని గిబ్బన్స్‌విల్లేలో తన సొంత కర్మాగారం ఏర్పాటు చేశాడు. తరువాత అండ్రిమేన్‌లీ మూడో కుమారుడు 1870లో పాయిల్‌ నది ఓడ్డున మేన్‌లీ బెల్‌ కంపెనీని స్థాపించాడు. ఈ బెల్‌ కంపెనీ 1952 వరకు పని చేసింది. 1883లో వీరు ఎక్కువ సంఖ్యలో బెల్స్‌ను తయారుచేశారు. ఆ విధంగా తయారైన బెల్‌ను 1983లో వరంగల్‌కు తీసుకొచ్చి హనుమకొండ సెంటినరీబాప్టిస్ట్‌ చర్చిలో ఏర్పాటు చేశారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన చర్చి బెల్‌ను మేన్‌లీ అండ్‌ కంపెనీ తయారు చేసింది.

సెంటినరీబాప్టిస్ట్‌ చర్చిలో వందేళ్లకు పైబడిన బెల్‌

Advertisement
Advertisement