No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 18 2024 7:50 AM

No Headline

కాజీపేటలో స్ట్రాం వాటర్‌ డ్రెయినేజీలు ఎటుచూసినా నాలుగు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. కాజీపేట చౌరస్తా నుంచి ప్రారంభమై రైల్వేకాలనీల మీదుగా బోడగుట్ట శివారులోని నాగులమ్మ చెరువులోకి ఉంటుంది. విష్ణుపురిలో ప్రధాన కాలువ మొదలై సోమిడి పెద్దచెరువు కుంట మీదుగా వడ్డేపల్లి రిజర్వాయర్‌ కట్ట వరకు మురుగు చేరుతోంది. రహ్మత్‌నగర్‌, వెంకటాద్రినగర్‌ కాలనీల నుంచి ఎఫ్‌సీఐ మీదుగా కాల్వలు వడ్డేపల్లి చెరువులోకి దారి ఉంది. మురుగు కాల్వలన్నీ చెత్తాచెదారంతోపాటు మట్టితో పూడుకపోయాయి. వాస్తవానికి ఏడాదికి ఒకసారి పూడిక తీయాల్సి ఉంటుంది. కానీ, రెండేళ్ల నుంచి తీయడం లేదు. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలుస్తోంది. ప్రతీ వర్షాకాలంలో స్థానికంగా ఉండేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. మురుగు కాల్వల్లో పూడిక తీయాలనే ఆలోచన ఎవరికీ రాకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోని పట్టణవాసులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు బాగా పడి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు రోజుల తరబడి మునిగితే తప్ప స్పందించే పరిస్థితి లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement