సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి

Published Tue, Apr 18 2023 4:40 AM

- - Sakshi

ఫిలింనగర్‌: పబ్లిక్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వివిధ విభాగాల అధికారుల బృందం సోమవారం జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌ బస్తీలో పర్యటించింది. కార్యక్రమ నోడల్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ డీఈ హరేరామ్‌, యూబీడీ విభాగం అధికారి వెంకట్‌, శానిటేషన్‌ ప్రతినిధి కృష్ణ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారి ఆనంద్‌, జలమండలి అధికారి శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ ఏఈ జయచంద్ర తదితరులు సమావేశంలో పాల్గొని స్థానికుల సమస్యలు తెలుసకోవడమే కాకుండా పరిష్కారానికి నోచుకునే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. సంవత్సరాల క్రితం వేసిన డ్రెయినేజీ పైప్‌లైన్లు ప్రస్తుతం పెరిగిన నివాసాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల తరచూ సీవరేజి సమస్య తలెత్తుతున్నదని మ్యాన్‌హోళ్లకు లీకవుతున్నాయని డ్రెయినేజీ పైపులు పెద్దవి వేయాలని స్థానికులు అధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే నివాసాలకు, రహదారులకు అడ్డుగా కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు ఉన్నాయిన వాటిని మరో చోటకు మార్చాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న మంచినీటి సమయాన్ని మరో పది నిమిషాలు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement