25 మంది పిల్లలను రెస్క్యూ చేసిన ఆర్పీఎఫ్‌ | Sakshi
Sakshi News home page

25 మంది పిల్లలను రెస్క్యూ చేసిన ఆర్పీఎఫ్‌

Published Wed, May 10 2023 6:02 AM

పిల్లలను రెస్క్యూ చేసిన ఆర్పీఎఫ్‌ పోలీసులు  - Sakshi

10 మంది అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

అడ్డగుట్ట: పిల్లల అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఆర్‌పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు నిరంతరం చేస్తున్న కృషి ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని ఆర్పీఎఫ్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ డెబస్మిత సి.బెనర్జీ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆపరేషన్‌ అగేన్‌స్ట్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌(ఏఏహెచ్‌టీ) లో భాగంగా సోమవారం ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్క్‌ప్రెస్‌లో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 10 మంది ట్రాఫికర్లను ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 25 మంది పిల్లలను రక్షించినట్లు తెలిపారు. సోమవా రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా విజయవాడ నుంచి వరంగల్‌ వరకు ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వెస్ట్‌ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 10 మంది హ్యూమన్‌ ట్రాఫికర్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 25 మంది పిల్లలను రక్షించినట్లు వెల్లడించారు.

డెబస్మిత సి.బెనర్జీ
1/1

డెబస్మిత సి.బెనర్జీ

Advertisement
Advertisement