పోటీకి నేను సిద్ధం అంటున్న బండారు విజయలక్ష్మి | Sakshi
Sakshi News home page

పోటీకి నేను సిద్ధం అంటున్న బండారు విజయలక్ష్మి

Published Mon, Sep 11 2023 6:50 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: బీజేపీ టికెట్‌ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వాలంటూ ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున పది నుంచి 50 మందికిపైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్పొరేటర్లు, సీనియర్‌ లీడర్లు ఉన్నారు. అత్యధికంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి 52 దరఖాస్తులు రావడం విశేషం. ఆశావహులు సమర్పించిన దరఖా స్తుల పరిశీలన పక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల పనితీరు, ప్రజల్లో వారికి ఉన్న మద్దతు, పార్టీలో సీనియార్టీ, అంగబలంతో పాటు ఆర్థిక బలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. వీరిలో ఎవరికి టికెట్‌ దక్కనుందో? అనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్త మవుతోంది.

► ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామరంగారెడ్డి, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొప్పుల నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చంపాపేట కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌రెడ్డి, హస్తి నాపురం డివిజన్‌ అధ్యక్షుడు పి.నరేష్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకులు కటకం నర్సింగరావు, యశ్పాల్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

► శేర్‌లింగంపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్‌ యాదవ్‌, సీనియర్‌ నేత గజ్జల యోగానంద్‌, రాష్ట్ర నాయకుడు కె. నరేష్‌ దరఖాస్తు చేసుకున్నారు.

► రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 52 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మైలార్‌ దేవులపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొక్కబాల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎన్‌.మల్లారెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యద ర్శి వై.శ్రీధర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్‌, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్‌ సహా పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తోకల శ్రీనివాసరెడ్డికే టికెట్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

► ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మీ, రాంనగర్‌ కార్పొరేటర్‌ కె.రవిచారి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సూర్య నారాయణ శర్మ, బీజేవైఎం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్‌, భాగ్యనగర ఉత్సవ కమిటీ నగర అధ్యక్షుడు వినయ్‌, ముషీరా బాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ రమేష్‌రాం, ముషీరా బాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సుప్రియ నవీన్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు సీకె శంకర్‌, తదితరులు ఉన్నారు.

► చార్మినార్‌ నియోజకవర్గం నుంచి ఉమామహేంద్ర, చేతన్‌కుమార్‌ సూరి, మీర్‌ ఫిరాసత్‌ అలీ బాక్రీ, నిత్య ఫారేఖ్‌, అశోక్‌సేన్‌, ఎం.కుమార్‌, నిమ్మల శ్రీనివాసగౌడ్‌ ఉన్నారు.

► కార్వాన్‌ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టి.అమర్‌సింగ్‌, దేవర శ్రీనివాస్‌, జి.శివరత్నం, కట్ల అశోక్‌, జి.సునిల్‌ యాదవ్‌, బోడి అన్నూ యాదవ్‌, బి.దర్శన్‌, రావుల మాణిక్‌ ప్రభూలు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.

► గోషామహల్‌ నియోజకవర్గం నుంచి 12 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాజీ మంత్రి తనయుడు ఎం,విక్రమ్‌గౌడ్‌, గోల్కొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాండు యాదవ్‌, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావు, పార్టీ సీనియర్‌ నేత వనమాల గోపాల్‌, గోషామహహల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్‌, బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌, కిసాన్‌ మోర్చసిటీ కార్యదర్శి ముక్క కృష్ణగుప్తా, గోల్కొండజిల్లా కార్యదర్శి రఘునందన్‌ యాదవ్‌ ఉన్నారు.

► కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, పార్టీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ఓబీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు దివాకర్‌, మాజీ నియోజకవర్గ కన్వీనర్‌ శంకర్‌రెడ్డి, కొంపెల్లి బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ రాజిరెడ్డి, జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరతసింహా ఉన్నారు.

►మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, జగన్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జహంగీర్‌, సంతోష్‌లు దరఖాస్తు చేసుకున్నారు.

► ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌తో పాటు మరికొంత మంది దరఖాస్తు చేసున్నారు.

యాకుత్‌ పురా నుంచి..
యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి 14 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. సహదేవ్‌ యాదవ్‌, నిరంజన్‌ యాదవ్‌, వీరేంద్రబాబు, రాజేశ్వర్‌, చర్మని రూప్‌ రాజ్‌, దశరథ లక్మి, జమాల్‌ పూర్‌ అశోక్‌, జంపాల మధు, ఆర్‌. ఈశ్వర్‌ యాదవ్‌, అనీఫ్‌ అలీ, మీర్జా అఖిల్‌ ఆఫాది, నళిని గౌడ్‌, రమేష్‌ యాదవ్‌, పుప్పల మధుసూదన్‌ రావు, దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం..
►ఊరడి సత్యనారాయణ, సయ్యద్‌ షహజాది, వరలక్ష్మీ

► పొన్న శ్రీనివాసారావు, వెంకటేష్‌, డాక్టర్‌ పండరీ జాని,

► రాజ్‌ కుమార్‌, చిరంజీవి, పండరీనాథ్‌

జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు, సీనియర్‌ నేతలు

ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తు

అత్యధికంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి 52 మంది ఆశావహులు

Advertisement
Advertisement