మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఎనలేనివి | Sakshi
Sakshi News home page

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఎనలేనివి

Published Mon, Oct 2 2023 7:06 AM

నివాళులర్పిస్తున్న మధుసూదనాచారి తదితరులు  - Sakshi

చిక్కడపల్లి: దేశంలో వివిధ ప్రాజెక్టుల రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్సీ ఎస్‌.మధుసూదనాచారి అన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఆదివారం ‘శతాబ్దిపూర్వ మహనీయుల యాది’ కార్యక్రమంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సంస్మరణ సభ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతిభను చాటిన విశ్వేశ్వరయ్య మన వద్ద మూసీ నదిపై వరదలు రాకుండా వంతెన నిర్మాణానికి గొప్ప సూచనలు చేశారని, తెలంగాణ ప్రాంతంలో మంచినీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామి అయ్యారని తెలిపారు. సాహితీవేత్త జయరాములు, గానసభ సంయుక్త కార్యదర్శి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

100 శాతం స్కాలర్‌షిప్‌తో ఐఏఎస్‌ కోచింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్‌/ఐపీఎస్‌ ఆఫీసర్‌లు కావాలని కోరుకున్నప్పటికీ ఆర్థిక పరిమితుల కారణంగా తమ కల సాకారానికి దూరంగానే ఉండిపోతున్న విద్యార్థుల కోసం మేడ్‌ ఈజీ గ్రూప్‌నకు చెందిన నెక్స్ట్‌ ఐఎఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ట్యూషన్‌ ఫీజులో 100 శాతం వరకు ఆర్థిక సహాయాన్ని అందించే ఈ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్ష ఈ నెల 15న జరుగుతుందని, ఈ నెల 5వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. స్కాలర్‌షిప్‌కు అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు.

ఎమ్మెల్సీ ఎస్‌.మధుసూదనాచారి

Advertisement
Advertisement