బీజేపీలోకి ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి? | Uppal MLA Bheti Subhash Reddy Likely To Join In The BJP After Unhappy For BRS Ticket - Sakshi
Sakshi News home page

Uppal MLA Party Change News: బీజేపీలోకి ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి?

Published Thu, Oct 12 2023 5:38 AM

- - Sakshi

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప్పల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డికి ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది.

ఇక్కడి నుంచి టికెట్‌ కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement