కాంగ్రెస్‌లోకి ‘సిద్ధంకి’ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ‘సిద్ధంకి’

Published Mon, Oct 30 2023 5:02 AM

-

అబ్దుల్లాపూర్‌మెట్‌: పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ సిద్ధంకి కృష్ణారెడ్డి అనుకున్నట్లుగానే ఆదివారం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఉదయం సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సిద్ధంకి నివాసానికి వచ్చిన ఆయన చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దంకి కృష్ణారెడ్డితో పాటుగా పార్టీలో చేరిన సహకార సంఘం డైరెక్టర్‌ గంటా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ సిద్దంకి రాజిరెడ్డి, నాయకులు సిద్దంకి జగన్మోహన్‌రెడ్డి, పాలడుగు నాగార్జున తదితరులకు వంశీచంద్‌రెడ్డి, మల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షు డు కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్‌రెడ్డి, రాజేందర్‌ముదిరాజ్‌, జయశ్రీరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement