రూ.34.50 లక్షల నగదు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.34.50 లక్షల నగదు స్వాధీనం

Published Tue, Oct 31 2023 6:50 AM

స్వాధీనం చేసుకున్న నగదు  - Sakshi

రాంగోపాల్‌పేట్‌: హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.34.50లక్షల నగదును సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నితికా పంత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శివన్షు రాయ్‌, నల్లగుట్టకు చెందిన వ్యాపారి భవేష్‌ కుమార్‌ జైన్‌ హవాలా లావాదేవీలు నిర్వహిస్తుంటారు.

వీరు తమ కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసిన నగదును మరో కస్టమర్‌కు అందించేందుకు డ్రైవర్‌ మన్సూర్‌తో కలిసి ఆదివారం రాత్రి జీపులో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వెనుక నిరీక్షిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ రాజు నాయక్‌, ఎస్సైలు సాయికిరణ్‌, నవీన్‌ కుమార్‌ దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి రూ.34.50 లక్షల నగదు, థార్‌ జీపు, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసికున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement