Sakshi News home page

అడ్రస్‌ మారిందా..? ఆయుధాలు డిపాజిట్‌ చేయండి

Published Wed, Nov 8 2023 4:40 AM

-

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిరునామా మార్చుకున్న లైసెన్స్‌దారులు తమ ఆయుధాలను వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆయుధాలను డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చాలామంది తమ లైసెన్స్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేశారు. ఇంటి చిరునామా మారడంతో కొందరు తమ ఆయుధాలను డిపాజిట్‌ చేయలేదు. వీరు వెంటనే తమ ఆయుధాలను డిపాజిట్‌ చేయాలని సీపీ చెప్పారు. ఆయుధాలను డిపాజిట్‌ చేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement