ప్రత్యర్థి ‘పద్మ’లు ఒక్కటయ్యారు!

9 Nov, 2023 06:00 IST|Sakshi

ఇద్దరు మహిళా నేతలు రెండుసార్లు కార్పొరేటర్‌ ఎన్నికల్లో పోటీ పడ్డారు. వీరిద్దరూ ఒక్కో దఫా విజయం సాధించారు. వీరిలో ఒకరు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన కె.పద్మావతిరెడ్డి. మరొకరు బీజేపీ నాయకురాలు బి.పద్మా వెంకట్‌రెడ్డి. అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ ఎన్నికల్లో రెండుసార్లు ప్రత్యర్థులుగా పోటీ పడిన వీరు.. చేరోసారి గెలిచారు. ప్రస్తుతం బీజేపీ నుంచి పద్మా వెంకట్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన ఇరువురు మహిళా నేతలు తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. – అంబర్‌పేట్‌

ప్రత్యర్థి ‘పద్మ’లు ఒక్కటయ్యారు!

మరిన్ని వార్తలు