టీపీసీసీ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్‌గా వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌ | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్‌గా వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌

Published Fri, Nov 17 2023 4:28 AM

- - Sakshi

నాగోలు: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్‌గా కొత్తపేటకు చెందిన జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ వజీర్‌ ప్రకాష్‌ గౌడ్‌ను నియమిస్తూ గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వజీర్‌ ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జక్కిడి ప్రభాకర్‌ రెడ్డి, భూపతి రెడ్డి నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement